రెండో రోజు నష్టాలు

 Sensex Falls Nearly 200 Points, Settles Below - Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా నష్టాల్లో ముగిసాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో అమ‍్మకాలు వెల్లువెత్తాయి.  దీంతో  ఆరంభ లాభాలు ఆవిరైపోయాయి. చివరి రెండు గంటల్లో పెరిగిన అమ్మకాల షాక్‌తో సెన్సెక్స్‌ 41,000 పాయింట్ల మార్క్‌ దిగువకు, నిఫ్టీ 12100 దిగువకు చేరింది. సెన్సెక్స్‌ 188 పాయింట్లు క్షీణించి 40,967 వద్ద, నిఫ్టీ 63 పాయింట్ల వెనకడుగుతో 12,056 వద్ద స్థిరపడింది. కరోనా వైరస్‌ ఆందోళనలు సెంటిమెంటును దెబ్బతీసినట్లు విశ్లేషకులు  భావిస్తున్నారు. మరోవైపు శనివారం కేంద్ర బడ్జెట్‌  సమర్పించనున్న నేపత్యంలో మార్కెట్లు అస్థిరంగా ఉండే అవకాశం ఉందని అంచనా. ప్రధానంగా మెటల్‌ ఇండెక్స్‌ 2.4 శాతం క్షీణించగా.. ఆటో, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్స్‌  నష్టపోగా, ఐటీ స్వల్పంగా స్వల్పంగా పుంజుకుంది. నిఫ్టీ దిగ్గజాలలో వేదాంతా, భారతి  ఎయిర్‌టెల్‌, టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, జీ, ఆర్‌ఐఎల్‌, యస్‌ బ్యాంక్‌, మారుతీ, కోల్‌ ఇండియా  భారీగా నష్టపోగా, బీపీసీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫైనాన్స్‌, సన్‌ ఫార్మా, బజాజ్‌ ఫిన్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టీసీఎస్‌, ఐవోసీ, టెక్‌ మహీంద్రా, కొటక్‌ బ్యాంక్‌  స్వల్ప  లాభాలతో ముగిసాయి.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top