చరిత్రాత్మక గరిష్ట స్థాయిల్లో అమ్మకాల ఒత్తిడి

Sensex Cools Off After Touching Record High - Sakshi

ముంబై : చమురు పతనంతో మంగళవారం భారీ లాభాలను ఆర్జించిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు, వరుసగా రెండో రోజూ హుషారుగా ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సెంచరీని బీట్‌ చేసింది. దీంతోఈ నెల 13న నమోదైన 36,740 రికార్డును అధిగమించి, 36,748 మార్కును చేరి ఇంట్రాడేలో చరిత్రాత్మక గరిష్ట స్థాయిని తాకింది. అయితే రికార్డు స్థాయిలో మోత మోగించిన స్టాక్‌ మార్కెట్‌లో కొద్ది సేపటికే అమ్మకాల ఒత్తిడి నెలకొని, మార్కెట్లు కాస్త కిందకి దిగజారాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 126 పాయింట్ల లాభంలో 36,645 వద్ద ట్రేడవుతోంది.

11,066 మార్కుకు చేరిన నిఫ్టీ సైతం 42 పాయింట్ల లాభంలో 11,050 వద్ద నడుస్తోంది. ట్రేడింగ్‌ ప్రారంభంలో అన్ని రంగాల సూచీలు లాభాల పంట పండిచాయి. అయితే చరిత్రాత్మక రికార్డు స్థాయిలకు మార్కెట్లకు చేరుకోవడంతో, ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీశారు. పీఎస్‌యూ బ్యాంక్‌లు, మెటల్స్‌ ఈ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఐటీ, ఎనర్జీ రంగాలు గ్రీన్‌గా ట్రేడవుతున్నాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ స్వల్పంగా 1 పైస లాభపడి 68.45 వద్ద ట్రేడవుతోంది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా 345 రూపాయలు నష్టపోయి 29,735 రూపాయల వద్ద కొనసాగుతున్నాయి. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top