ఐపీఓలతో రుణ వృద్ధి

SBI's latest report on iop's - Sakshi

మార్కెట్‌ జోరు కొనసాగినన్నాళ్లూ ఇష్యూలు

ఈ ఏడాది సమీకరించింది రూ.49,175 కోట్లు

ఎస్‌బీఐ తాజా నివేదిక వెల్లడి

ముంబై: ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్ల (ఐపీఓ) జోరుతో రుణ వృద్ధి మెరుగుపడుతోందని ఎస్‌బీఐ రూపొందించిన తాజా నివేదిక పేర్కొంది. ఐపీఓల ద్వారా నిధుల సమీకరణకు, రుణ వృద్ధికి ప్రత్యక్ష సంబంధం లేకపోయినా, ఈ ఏడాది అధికంగా ఐపీఓల ద్వారా నిధల సమీకరణ జరిగిందని, ఇది రుణవృద్ధి పెరగడానికి తోడ్పడిందని ఈ నివేదిక వెల్లడించింది. ముఖ్యాంశాలివీ...

మార్కెట్‌ జోరు కొనసాగినంత కాలం ఐపీఓల జోరు కూడా కొనసాగుతుంది.
ఇటీవల కాలంలో స్టాక్‌ మార్కెట్లో లిస్టయిన కంపెనీల షేర్ల జోరును బట్టి, భవిష్యత్తు ఐపీఓ మార్కెట్‌ అధారపడి ఉంటుంది.
ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌ వరకూ పలు కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.49,175 కోట్లు సమీకరించాయి. ఇది 2012–2016 మధ్య కాలంలో వచ్చిన ఐపీఓల ద్వారా సమీకరించిన నిధులు కంటే ఎక్కువ.
2014–15 ఆర్థిక సంవత్సరం వరకూ ఐపీఓ మార్కెట్‌ అంతంత మాత్రంగానే ఉంది.
2015–16లో 70 కంపెనీలు, గత ఆర్థిక సంవత్సరంలో 106 కంపెనీలు కొత్తగా స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌కాగా,  ఈ ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్‌ వరకూ మొత్తం 112 కొత్త కంపెనీలు స్టాక్‌ మార్కెట్లో లిస్టయ్యాయి.
ఈ ఆర్థిక సంవత్సరంలో బీమా రంగం నుంచి నాలుగు కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.31,320 కోట్లు సమీకరించాయి.
రంగాల వారీగా చూస్తే, ఆయా సంవత్సరాల్లో ఐపీఓలు వచ్చిన రంగాల్లో రుణ వృద్ధి మెరుగుపడింది. ఉదాహరణకు 2009–10, 2010–11 మధ్య విద్యుత్తు రంగానికి సంబంధించిన ఐపీఓలు అధికంగా వచ్చాయి. ఆయా సంవత్సరాల్లో విద్యుత్తు రంగంలో చెప్పుకోదగిన స్థాయిలో రుణ వృద్ధి పెరిగింది.
2009–10, 2010–11 ఆర్థిక సంవత్సరాల్లో మైనింగ్, క్వారీయింగ్, లోహ రంగాల కంపెనీలు ఐపీఓలు వచ్చాయి. ఆ యా సంవత్సరాల్లో ఈ రంగాల్లోను రుణ వృద్ధి బాగుంది.
అయితే గత ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది ఐటీ కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.2,103 కోట్లు సమీకరించినప్పటికీ, ఐటీ రంగంలో రుణ వృద్ధి కుంటుపడింది. అలాగే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగానికి కూడా ఇదే దారి. ఈ రంగాలపై దేశీయ అంశాల కన్నా అంతర్జాతీయ అంశాలే అధికంగా ప్రభావం చూపించడం దీనిక కారణం కావచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top