శాంసంగ్‌ కొత్త వేరబుల్‌ ప్రొడక్ట్స్‌

Samsung Gear Fit 2 Pro, Gear Sport Launched in India: Price, Specifications  - Sakshi

గేర్‌ ఫిట్‌ 2 ప్రొ, గేర్‌ స్పోర్ట్‌ ఆవిష్కరణ 

న్యూఢిల్లీ: శాంసంగ్‌ ఇండియా తాజాగా రెండు వేరబుల్‌ ప్రొడక్ట్స్‌ను మార్కె ట్‌లోకి తీసుకువచ్చింది. ‘గేర్‌ ఫిట్‌ 2 ప్రొ’ , ‘గేర్‌ స్పోర్ట్‌’ అనే వీటి ధర వరుసగా రూ.13,590గా, రూ.22,990గా ఉంది. ఈ రెండింటిలోనూ వాటర్‌ రెసిస్టెన్సీ, స్విమ్‌ ట్రాకింగ్‌ టెక్నాలజీ ఫీచర్లున్నాయి. ఇక ఈ ప్రొడక్టులు వచ్చే నెలలో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నవి.  

 గేర్‌ స్పోర్ట్‌: ఇది ఒక ఫిట్‌నెస్‌ ఫోకస్‌డ్‌ స్మార్ట్‌వాచ్‌. ఇందులో 1.2 అంగుళాల గుండ్రని స్క్రీన్, గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్, 4 జీబీ మెమరీ, 768 ఎంబీ ర్యామ్, 1 గిగాహెర్ట్జ్‌ డ్యూయెల్‌ కోర్‌ ప్రాసెసర్, 300 ఎంఏహెచ్‌ బ్యాటరీ, వై–ఫై, జీపీఎస్, బ్లూటూత్‌ ఉన్నాయి.  

 గేర్‌ ఫిట్‌ 2 ప్రొ: ఫిట్‌నెస్‌ బ్యాండ్‌. 50 మీటర్ల లోతులోనూ వాటర్‌ రెసిస్టెన్సీ సొంతం. 1.5 అంగుళాల స్క్రీన్, 512 ఎంబీ ర్యామ్‌ 200 ఎంఏహెచ్‌ బ్యాటరీ, వై–ఫై, బ్లూటూత్, 1 గిగాహెర్ట్జ్‌ డ్యూయెల్‌ కోర్‌ ప్రా సెసర్, హార్ట్‌ రేట్‌ సెన్సార్‌ వంటి ప్రత్యేకతలున్నాయి.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top