గెలాక్సీ ఆన్‌6 లాంచ్‌, ఆఫర్లు కూడా..

Samsung Galaxy On6 Smartphone Launched - Sakshi

న్యూఢిల్లీ : అంచనాలకు అనుగుణంగానే శాంసంగ్‌ తన తాజా బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ గెలాక్సీ ఆన్‌ 6 ను భారత మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. స్లీక్‌ డిజైన్‌ను ఇష్టపడే లక్షల మంది వినియోగదారుల కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌ను డిజైన్‌ చేసినట్టు శాంసంగ్‌ పేర్కొంది.  ఎక్స్‌క్లూజివ్‌గా ఈ స్మార్ట్‌ఫోన్‌ బ్లూ రంగులో ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. గెలాక్సీ ఆన్‌ 6 ధరను రూ.14,490గా కంపెనీ నిర్ణయించింది. 

ఈ ఫోన్‌పై లాంచ్‌ ఆఫర్లను కూడా శాంసంగ్‌ ప్రకటించింది. నో కాస్ట్‌ ఈఎంఐ నెలకు రూ.1,610 నుంచి ప్రారంభమవుతుంది. ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ ఈ ఫోన్‌పై రూ.12,200 ఉంది. దీంతో పాటు వీసా కార్డుల ద్వారా ఆన్ పేమెంట్లకు 5 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ అందుబాటులో ఉంటుంది. షియోమి రెడ్‌ మి 5 ప్రొకు, మోటో జీ 6 స్మార్ట్‌ఫోన్ల నుంచి దీనికి గట్టి పోటీ ఎదురు రానుంది. 

గెలాక్సీ ఆన్‌ 6 స్పెషిఫికేషన్లు...
5.6 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ ఇన్ఫినిటీ ఎడ్జ్‌ డిస్‌ప్లే
కార్నింగ్‌ గొర్రిల్లా గ్లాస్‌
డ్యూయల్‌ సిమ్‌
ఆండ్రాయిడ్‌ 8.0 ఆపరేటింగ్‌ సిస్టమ్‌
కంపెనీకి చెందిన ఎక్సీనోస్‌ ప్రాసెసర్‌
4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
13 ఎంపీ రియర్‌ షూటర్‌, 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top