శాంసంగ్‌ జె 4 లాంచ్‌.. ధర, ఫీచర్లు

Samsung Galaxy J4 starting at Rs 9,990 launched in India - Sakshi

జె4స్మార్ట్‌ఫోన్‌ : రెండు వేరియంట్లలో

అడ్వాన్స్‌డ్‌​ మొమరీ మేనేజ్‌మెంట్‌, శాంసంగ్‌ మాల్‌

ఎడ్జస్టబుల్‌ ఫ్రంట్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌ స్పెషల్‌  ఎట్రాక్షన్‌

సాక్షి, న్యూఢిల్లీ: శాంసంగ్‌ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. గెలాక్సీ జె సిరీస్‌లో శుక్రవారం సరికొత్త డివైస్‌ను తీసుకొచ్చింది.  జె4 పేరుతో  విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను రెండు వెర్షన్లలో  శాంసంగ్‌ విడుదల చేసింది. 2జీబీ/ 16జీబీ స్టోరేజ్ ధరను 9,990 రూపాయలుగా నిర్ణయించింది. 3జీబీ‌/32 జీబీ స్టోరేజ్‌  వెర్షన్‌​ ధరను రూ.11,990గా ఉంచింది. ఈ ఫోన్లు నీలం, నలుపు,  బంగారు రంగుల్లో అందుబాటులో ఉంటుందని శాంసంగ్‌ వెల్లడించింది.

"మేక్ ఫర్ ఇండియా" లో భాగంగా తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో అధునాతన మెమరీ మేనేజ్‌మెంట్‌ ఫీచర్‌ను జోడించినట్టు చెప్పారు. సోషల్ మీడియా అప్లికేషన్ల నుంచి వచ్చే డూప్లికేట్‌  ఫోటోలు, వీడియో కంటెంట్‌ను ఆటోమేటిక్‌గా డిలీట్‌ చేస్తుందని తెలిపారు.  తద్వారా మొమరీ స్పేస్‌ బాగా ఆదా అవుతుందని పేర్కొన్నారు. అడ్వాన్స్‌డ్‌​ మొమరీ మేనేజ్‌మెంట్‌తోపాటు, శాంసంగ్‌ మాల్‌, ఎడ్జస్టబుల్‌ ఫ్రంట్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌ జె4లో ప్రత్యేక ఫీచర్లుగా  ఉన్నాయన్నారు.

గెలాక్సీ జె 4 ఫీచర్లు
5.5 అంగుళాల హెచ్‌డీ సూపర్ అమోలెడ్‌ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ ఓరెయో 8.0
13ఎంపీ రియర్‌ కెమెరా విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌
5ఎంపీ సెల్ఫీ కెమెరా  విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌
2జీబీ/16జీబీ స్టోరేజ్ , 3జీబీ‌/32 జీబీ స్టోరేజ్‌
256 దాకా విస్తరించుకునే అవకాశం
3,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top