శాంసంగ్‌ గెలాక్సీ ఏ9 స్మార్ట్‌ఫోన్‌ : ప్రీ బుకింగ్స్‌

Samsung Galaxy A9 (2018)Launched in India - Sakshi

సాక్షి, ముంబై: మొబైల్‌ దిగ్గజం శాంసంగ్‌ తన కొత్త ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోను ఇండియన్‌ మార్కెట్లో లాంచ్‌ చేసింది. నాలుగు రియర్‌ క్వాడ్‌ కెమెరాలతో శాంసంగ్‌ గెలాక్సీ ఏ9 (2018)స్మార్ట్‌ఫోన్‌ను భారతీయ వినియోగదారులకు అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ప్రీ-బుకింగ్స్‌ను నేటినుంచి (నవంబరు 20) ప్రారంభించింది. 6జీబీ, 8జీబీర్యామ్‌ రెండు వెర్షన్‌లలో ఈ డివైస్‌ లభించనుంది. 

ప్రపంచంలో క్వాడ్‌ కెమెరాలతో లాంచే చేసిన తొలి స్మార్ట్‌ఫోన్‌గా గెలాక్సీ ఏ9ను శాంసంగ్‌ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర 36,990 రూపాయలు ప్రారంభం. అలాగే 8జీబీ, 128 జీబీ వేరియంట్‌ ధర రూ. 39,990.  ఎయిర్‌టెల్‌, అమెజాన్‌, శాంసంగ్‌, పేటీఎం మాల్‌, ఫ్లిప్‌కార్ట్‌ల ద్వారా ప్రీ బుకింగ్‌కు అందుబాటులో ఉంది.


 

లాంచింగ్‌ ఆఫర్లు : హెచ్‌డీఎఫ్‌సీ కార్డుద్వారా కొనుగోలు చేస్తే రూ.3వేల  క్యాష్‌బ్యాక్‌  లభ్యం.

6.3  ఫుల్‌హెచ్‌డీ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే
1080x2160  పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
స్నాప్‌డ్రాగన్‌ 660  సాక్‌ ప్రాసెసర్‌
6/8 జీబీ ర్యామ్‌, 128 జీబీ  స్టోరేజ్‌
512 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం
24+10+8+5 ఎంపీ రియర్‌ కెమెరాలు
24 ఎంపీ సెల్పీ కెమెరా
3800 ఎంఏహెచ్‌ బ్యాటరీ


 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top