10పైసలు బలపడిన రూపాయి

Rupee slips to 16-month low, gains foothold with RBI help - Sakshi

సాక్షి, ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ గురువారం ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభంలో 10 పైసలు లాభపడింది.  బుధవారం  నాటి  67.80ముగింపుతో  పోలిస్తే  15నెలల కనిష్టం నుంచి కోలుకుంది.  డాలర్‌ మారకంలో  గురువారం  0.08 శాతం లాభంతో  67.70 వద్ద ప్రారంభమయ్యింది.  బ్యాంకులు, ఎగుమతిదారులు అమెరికా డాలరును అమ్మేందుకు క్యూ కట్టిన నేపథ్యంలోనే ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి మారకం విలువ కాస్త నిలబడగలిగిందని ఫారెక్స్‌ మార్కెట్‌ నిపుణులు తెలియజేశారు. కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం పూర్తికావడం సెంటిమెంట్‌ను మెరుగుపరిచిందని వివరించారు. 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌ బుధవారం ముగింపు 7.903 శాతం కాగా.. గురువారం ఉదయం 7.924 శాతం వద్ద ప్రారంభమయ్యింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదల కారణంగా గతకొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న రూపాయి విలువ.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 5.8 శాతం బలహీనపడింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top