రూ.25,000కోట్లకు.. ఐపీవోలు

Rs 25,000 crore for IPOs - Sakshi

క్యూలో రెండు డజన్లకు పైగా కంపెనీలు

ఐసీఐసీఐ సెక్యూరిటీస్, భారత్‌ డైనమిక్స్, హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌

న్యూఢిల్లీ: రెండు డజన్లకు పైగా కంపెనీలు ఐపీవో మార్గంలో నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి.  రూ.25,000 కోట్ల నిధుల సమీకరణకు సన్నద్ధమవుతున్నాయి. హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, బార్బెక్యూ నేషన్‌ హాస్పిటాలిటీ, ఫ్లెమింగో ట్రావెల్‌ రిటైల్,  తదితర కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. రానున్న నెలల్లో ఇవన్నీ నిధులు సమీకరించనున్నాయి. సెబీ వద్ద ఈ కంపెనీలు దాఖలు చేసిన ఐపీవో పత్రాలను పరిశీలిస్తే విస్తరణ, మూలధన అవసరాలకు, బ్రాండ్‌ విలువ పెంచుకునేందుకు, వాటాదారులకు లిక్విడిటీ కోసం ఐపీవోలకు వస్తున్నట్టు తెలుస్తోంది.

బార్బెక్యూ నేషన్‌ హాస్పిటాలిటీ, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, భారత్‌ డైనమిక్స్, ఇండియన్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ ఐపీవోలకు సెబీ ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇంకా రైట్స్, మిశ్రధాతు నిగమ్‌ లిమిటెడ్, బంధన్‌ బ్యాంకు, ఇండోస్టార్‌ క్యాపిటల్‌ ఫైనాన్స్, నజారా టెక్నాలజీస్, రూట్‌ మొబైల్‌ సహా 20 కంపెనీలు సెబీ అనుమతి కోసం వేచి చూస్తున్నాయి. ఈ కంపెనీలన్నీ కలసి సుమారు రూ.25,000 కోట్ల నిధుల్ని సమీకరించనున్నాయని మర్చంట్‌ బ్యాంకింగ్‌ వర్గాలు తెలిపాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top