రిలయన్స్ జియో సంచలనం

Reliance Jio Crosses 300 mn Customers Mark - Sakshi

300 మిలియన్ల కస్టమర్లతో రికార్డు

ముంబై : టెలికాం రంగం సంచలనం రిలయన్స్‌ జియో రికార్డు సృష్టించింది. సేవలు ప్రారంభించిన రెండున్నరేళ్లలోనే 300 మిలియన్ల కస్టమర్ల మార్క్‌ను అధిగమించింది. ఈ మైలురాయిని మార్చి 2నే అందుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ సీజన్‌ సందర్భంగా టీవీల్లో ఇచ్చే కమర్షియల్‌ యాడ్స్‌లో .. ‘సెలబ్రేటింగ్‌ 300 మిలియన్‌ యూజర్స్‌’  అని పేర్కొనడంతో ఈ విషయం స్పష్టమైంది. ఇక భారతీ ఎయిర్‌టెల్‌ ఈ మైలురాయిని తమ సేవలు ఆరంభించిన 19వ ఏట అందుకోగా.. జియో రెండున్నరేళ్లలో అందుకోవడం విశేషం. ఇక వోడాఫోన్‌, ఐడియాలు వీలినం కావడంతో 408 మిలియన్ల వినియోగదారులతో దేశంలోనే అగ్రగామి సంస్థగా నిలిచిన విషయం తెలిసిందే. కమర్షియల్‌ సేవలు ప్రారంభించిన 170 రోజుల్లోనే జియో 100 మిలియన్ల కస్టమర్లను అందుకొని ప్రపంచ తొలి టెలికాం సంస్థగా నిలిచింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement
Back to Top