‘జియోఫై’ పై భారీ డిస్కౌంట్‌: పండుగ ఆఫర్‌

‘జియోఫై’ పై భారీ డిస్కౌంట్‌: పండుగ ఆఫర్‌


 


  • జియోఫై   పై ప్రత్యేక డిస్కౌంట్‌..రూ. 999 కే

  • ‘జియో ఫై’ వాస్తవ ధర రూ.1999

  • సెప్టెంబర్‌ 20-30 వరకు


సాక్షి, హైదరాబాద్: టెలికాం మార్కెట్లో ఇప్పటికే సంచలనం సృష్టిస్తోన్న రిలయన్స్‌ జియో తమ ఖాతాదారులకు మరో బంపర్‌ ఆఫర్‌ అందుబాటులోకి తెచ్చింది. జియో  హాట్‌ స్పాట్‌ ను ధరను సగానికి పైగా  తగ్గించింది  ‘జియో ఫై’  4 జీ హాట్ స్పాట్ పై  ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించింది. రూ. 1000 డిస్కౌంట్‌ తో పదిరోజుల పాటుచెల్లుబాటయ్యేలా పండుగ ఆఫర్‌ను లాంచ్‌ చేసింది. దసరా పండుగను పురస్కరించుకొని ప్రవేశపెట్టిన ఈ ఆఫర్ కింద జియో ఫై ధరను రూ. 999 గా (వాస్తవ ధర 1999) నిర్ణయించింది. సెప్టెంబర్ 20 నుంచి 30 వరకు  అందుబాటులో ఉంటుంది.



4జీ ఫోను లేకపోయినా 4 జీ వేగంతో డేటా, కాలింగ్ సదుపాయాలు పొందగలిగే సౌకర్యాన్ని జియో ఫై కల్పిస్తుంది. అలాగే వినియోగదారులు 3జీ లేదా 2జీ స్మార్ట్ ఫోన్లలో, లాప్ టాప్ లలో జియో యొక్క అద్భుతమైన సేవలను పొందవచ్చు. దీనితో కుటుంబ సభ్యులు లేదా చిన్న సంస్థలోని సిబ్బందిని జియో డిజిటల్ లైఫ్ కి అనుసందానం చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్లు, లాప్టాప్ లు, టాబ్లెట్ తదితర 10 నుంచి 32 వై ఫై పరికరాలను జియో ఫై తో అనుసంధానం చేసుకోవచ్చు.



ఎలా పనిచేస్తుంది?



2జీ, 3జీ ఫోన్లలో జియో ఎలా పనిచేస్తుందనే సందేహం చాలా మందికి కలగవచ్చు. ప్రతీ జియో ఫై తో ఒక జియో సిమ్ వస్తుంది. ఈ పరికరంలో సిమ్ వేసిన తరువాత ఇది వై ఫై హాట్ స్పాట్ గా పనిచేస్తుంది. ఆ తరువాత ‘జియో 4జీ వాయిస్’ అప్లికేషన్ ను ప్లే స్టోర్ నుండి మీ 2జీ, 3జీ స్మార్ట్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని గంటల్లో సిమ్ ఆక్టివేట్ కాగానే జియో ఫై ద్వారా   ఫ్రీ వాయిస్ కాల్ సేవలు, 4 జీ డేటా సేవలను పొందవచ్చు. కాల్ చేసిన వ్యక్తికి మీ  10 అంకెల జియో ఫై నంబరు కనపడుతుంది. తిరిగి ఈ వ్యక్తి మీకు ఈ నంబరు కు కాల్ చేయవచ్చు. దీనితో, వోల్ట్‌ ద్వారా వీడియో,  హెచ్‌డీ కాల్స్,  ఇప్పుడు 2జీ/ 3జీ స్మార్ట్ ఫోన్లలో అందుబాటులో ఉంటాయి. అంతేకాదు వినియోగదారులు స్పష్టమైన హెచ్‌డీ వాయిస్ తో జియో నెట్ వర్క్ లో ఉండే వారితో మాట్లాడగలరు. జియో ఫై ఇప్పుడు దగ్గరలోని జియో రిటైల్ స్టోర్లతో పాటు జియో వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి.


కాగా ఈ డివైజ్ మొదటిసారిగా సెప్టెంబర్ 2016లో లాంచ్‌ కాగా  అప్పట్లో దీని ధర రూ. 2,899 ఉండేది. ఆ తర్వాత దీని ధరని రూ. 1,999గా కంపెనీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.





 


 
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top