దలాల్‌ స్ట్రీట్‌ దూకుడు : రికార్డు క్లోజింగ్‌

Record Closing High For Sensex, Nifty - Sakshi

ముంబై : దలాల్‌ స్ట్రీట్‌ మారుమోగిపోయింది. దేశీయ స్టాక్‌ మార్కెట్లు మరోసారి రికార్డుల వర్షం కురిపించాయి. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న బలమైన సంకేతాలు, రూపాయి బలపడటం, బ్యాంక్‌ల ర్యాలీతో మార్కెట్లు దుమ్మురేపాయి. సెన్సెక్స్‌ ఏకంగా త్రిపుల్‌ సెంచరీని బీట్‌ చేయగా.. నిఫ్టీ తొలిసారి 11,550 మార్కు పైన ముగిసింది. మిడ్‌క్యాప్స్‌ కూడా నేడు మంచి ట్రేడింగ్‌ను జరిపాయి. మార్కెట్‌ క్లోజింగ్‌ అవర్స్‌ సందర్భంగా సెన్సెక్స్‌ 331 పాయింట్ల లాభంలో 38,278.75 వద్ద రికార్డు ముగింపు సాధించగా.. నిఫ్టీ 81 పాయింట్ల లాభంలో 11,550 పైన 11,551.80 పైన క్లోజైంది.

స్టాక్స్‌లో ఎల్‌ అండ్‌ టీ, టాటా మోటార్స్‌ టాప్‌ గెయినర్లుగా నిలువగా.. ఇన్ఫోసిస్‌, మారుతీ సుజుకీ, గెయిల్‌ టాప్‌ లూజర్లుగా నష్టాలు గడించాయి.  ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలకు చెక్‌ పెట్టేందుకు మంగళవారం నుంచీ చర్చలు మొదలుకానుండటంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. దీంతో అమెరికా, యూరప్‌, ఆసియా మార్కెట్లు లాభపడగా.. దేశీయంగానూ బుల్‌ ట్రెండ్‌ నెలకొన్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాలను చేరుకున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top