మార్కెట్ల స్ధిరత్వానికి చర్యలు : ఆర్‌బీఐ

RBI Says Monitoring Coronavirus Impact On Markets - Sakshi

ముంబై : అంతర్జాతీయంగా, దేశీయంగా కరోనా వైరస్‌ వ్యాప్తిని పరిశీలిస్తున్నామని, ఫైనాన్షియల్‌ మార్కెట్లపై వైరస్‌ ప్రభావాన్ని మదింపు చేయడంతో పాటు అవి సజావుగా పనిచేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్‌బీఐ మంగళవారం పేర్కొంది. కరోనా వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయని, మార్కెట్లలో విశ్వాసాన్ని పాదుకొల్పి సుస్ధిరతను కొనసాగించేందుకు నిర్ధిష్ట చర్యలు చేపట్టేందుకు సిద్ధమని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. కాగా కరోనా వైరస్‌ వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్‌ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం నెలకొన్న క్రమంలో ఆర్‌బీఐ ఈ ప్రకటన చేసింది. ఇక మార్చి 3లోగా రెగ్యులర్‌ వీసాలు, ఈ వీసాలు మంజూరై ఇప్పటివరకూ భారత్‌లోకి ప్రవేశించని ఇటలీ, ఇరాన్‌, దక్షిణ కొరియా, జపాన్‌ దేశీయుల వీసాలను సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. భారత్‌లో రెండు కరోనా కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

చదవండి : కోవిడ్‌-19 షాక్‌నకు ఆర్థిక టానిక్‌ అదే!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top