గత నెలలో 130 కోట్ల డాలర్ల పీఈ పెట్టుబడులు  

past month, $ 130 billion in investment - Sakshi

పీఈ లావాదేవీల్లో స్టార్టప్‌ల హవా 

గ్రాంట్‌ థార్న్‌టన్‌ నివేదిక వెల్లడి  

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ ఈక్విటీ(పీఈ) ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండు రెట్లు పెరిగాయని అష్యూరెన్స్, ట్యాక్స్‌ అడ్వైజరీ సంస్థ, గ్రాంట్‌ థార్న్‌టన్‌ తెలిపింది. ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే  పీఈ పెట్టుబడులు 67 శాతం వృద్ధితో 230 కోట్ల డాలర్లకు పెరిగాయని పేర్కొంది. స్టార్టప్, ఈ కామర్స్‌ కంపెనీల్లో పెట్టుబడులు జోరుగా వస్తుండటంతో పీఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ లావాదేవీలు కూడా జోరుగానే కొనసాగే అవకాశాలున్నాయంటున్న ఈ సంస్థ పీఈ పెట్టుబడులపై వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు... 

►గత ఏడాది ఫిబ్రవరిలో 58.8 కోట్ల డాలర్ల విలువైన మొత్తం 45 పీఈ ఇన్వెస్ట్‌మెంట్‌ లావాదేవీలు జరిగాయి.  
►ఈ ఏడాది ఫిబ్రవరిలో 130 కోట్ల డాలర్ల విలువైన 62 పీఈ ఇన్వెస్ట్‌మెంట్‌ లావాదేవీలు జరిగాయి.  
​​​​​​​►ఈ ఫిబ్రవరి పీఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో స్టార్టప్‌ డీల్స్‌ అధికంగా ఉన్నాయి. 47 శాతం వాటా స్టార్టప్‌ డీల్స్‌దే.  
​​​​​​​►ఫిన్‌టెక్, డిస్కవరీ ప్లాట్‌ఫామ్స్‌ చెరో ఐదు డీల్స్‌ను ఆకర్షించగా, హెల్త్‌ టెక్నాలజీ రంగంలో నాలుగు పీఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ డీల్స్‌ జరిగాయి.  
​​​​​​​►బిగ్‌బాస్కెట్‌ తన సిరీస్‌ ఈ రౌండ్‌లో 30 కోట్ల డాలర్ల పెట్టుబడులు సాధించింది. గత నెల్లో జరిగిన అతి పెద్ద పీఈ డీల్‌ ఇదే. ఆ తర్వాతి స్థానం ఫుడ్‌ డెలివరీ స్టార్టప్‌ స్విగ్గీ 10 కోట్ల డాలర్ల డీల్‌కు దక్కింది.  
​​​​​​​► ఇండియా గ్రిడ్‌ ట్రస్ట్‌ కంపెనీ స్టెరిలైట్‌ పవర్‌ గ్రిడ్‌ వెంచర్స్‌ నుంచి రూ.1,410 కోట్ల విలువైన మూడు ట్రాన్స్‌మిషన్‌ అసెట్స్‌ను కొనుగోలు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన చెప్పుకోదగ్గ డీల్స్‌లో ఇది కూడా ఒకటి.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top