మైక్రోసాఫ్ట్‌తో ఓలా జట్టు

Ola team with Microsoft - Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ ట్యాక్సీ అగ్రిగేటర్‌ ‘ఓలా’ తాజాగా టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘మైక్రోసాఫ్ట్‌’తో కనెక్టెడ్‌ వెహికల్‌ ప్లాట్‌ఫామ్‌ ఏర్పాటు కోసం అంతర్జాతీయ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా ఓలా.. మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), ప్రొడక్టివిటీ టూల్స్‌ సాయంతో తన కస్టమర్లకు మెరుగైన సేవలు అందించనుంది.

ప్రధానంగా ‘ఓలా ప్లే’ను కస్టమైజ్‌డ్‌ సర్వీసులు, టూల్స్, ఇన్‌ఫర్మేషన్‌తో అప్‌గ్రేడ్‌ చేయనుంది. ఉదాహరణకు ఓలా ప్లే యూజర్లు వెహికల్‌ కండీషన్, ఇంధన సామర్థ్యం, ఇంజిన్‌ పనితీరు వంటి వివరాలు పొందొచ్చు. ఇక డ్రైవర్లు వెహికల్‌ బ్రేక్‌డౌన్స్‌ అంచనా వేయడం, అడ్వాన్స్‌డ్‌ నావిగేషన్‌ గైడ్‌లైన్స్, వాహన మెయింటనెన్స్‌ సంబంధిత సేవలు పొందొచ్చు.

అలాగే ఓలా ప్లే కస్టమర్లు రైడింగ్‌లో ఉన్నప్పుడు మైక్రోసాఫ్ట్‌ ప్రొడక్టివిటీ టూల్స్‌ అయిన ఆఫీస్‌ 365, స్కైప్, వాయిస్‌ అసిస్టెడ్‌ కంట్రోల్స్‌ వంటి పలు సేవలను ఉపయోగించుకోవచ్చు. ఇరు సంస్థలు ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌ను కార్ల తయారీ కంపెనీలకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top