సింగపూర్‌ ఎక్స్చేంజిపై బాంబే హైకోర్టుకు ఎన్‌ఎస్‌ఈ

NSE moves HC against SGX over launch of derivatives - Sakshi

కొత్త ఫ్యూచర్స్‌ కాంట్రాక్ట్‌ ్స ప్రారంభించకుండా చర్యలు!  

న్యూఢిల్లీ:  ఇండియన్‌ డెరివేటివ్‌ ప్రొడక్ట్స్‌ (ఫ్యూచర్స్‌ కాంట్రాక్ట్స్‌)ను సింగపూర్‌ ఎక్స్చేంజి(ఎస్‌జీఎక్స్‌) ప్రారంభించకుండా నిరోధించడం లక్ష్యంగా నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజి(ఎన్‌ఎస్‌ఈ) బాంబే హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ‘మధ్యంతర నిలుపుదల’ ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించింది. అయితే ఎన్‌ఎస్‌ఈ కోర్టుకు వెళ్లినప్పటికీ,  ఇండియా కొత్త  ఈక్విటీ డెరివేటివ్‌ ప్రొడక్టులను జూన్‌లో ప్రారంభిస్తామని  సింగపూర్‌ ఎక్స్చేంజి ప్రకటించడం విశేషం.

న్యాయపోరాటంలో విజయం తమదేనని ఒక ప్రకటనలో ఎక్సే్ఛంజ్‌ పేర్కొంది. వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం  సింగపూర్‌ ఎక్స్చేంజిలో ప్రస్తుతం నిఫ్టీ 50 ఇండెక్స్‌ ట్రేడింగ్‌ భారత్‌ మార్కెట్ల కంటే కొన్ని గంటల ముందే ప్రారంభమై, అర్ధరాత్రి ముగుస్తోంది. అయితే దీనిని నిఫ్టీ 50 డెరివేటివ్‌ ప్రొడక్ట్స్‌ అన్నింటికీ విస్తరించాలని ఎస్‌జీఎక్స్‌ నిర్ణయించింది. ఇదే జరిగితే ఎస్‌జీఎక్స్‌లోనే భారత్‌ స్టాక్స్‌ డెరివేటివ్స్‌ ఫారిన్‌ ఇన్వెస్టర్స్‌ ట్రేడింగ్‌ పెరిగి, ఎన్‌ఎస్‌ఈలో వాల్యూమ్స్‌ తగ్గిపోయే అవకాశం ఉందన్నది విశ్లేషణ. అక్టోబర్‌ నుంచీ  అర్ధరాత్రి వరకూ భారత్‌ ఎక్సే్ఛంజీల్లో కూడా డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌ జరపాలన్న ప్రతిపాదనకు సెబీ ఆమోదముద్ర వేయడానికి కారణాల్లో ఇది కూడా ఒకటి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top