
స్పైస్‌జెట్ ప్రత్యేక ఆఫర్లు
చౌక చార్జీల విమానయాన సేవల సంస్థ స్పైస్‌జెట్ తాజాగా ‘హ్యాపీ న్యూ ఇయర్’ సేల్ కింద డిస్కౌంటు ఆఫర్లు ప్రకటించింది.
రూ. 716 బేస్ రేటుకే టికెట్
న్యూఢిల్లీ: చౌక చార్జీల విమానయాన సేవల సంస్థ స్పైస్‌జెట్ తాజాగా ‘హ్యాపీ న్యూ ఇయర్’ సేల్ కింద డిస్కౌంటు ఆఫర్లు ప్రకటించింది. దీని కింద జనవరి 15- ఏప్రిల్ 12 మధ్య ప్రయాణాలకు రూ. 716 బేస్ రేటుకే టికెట్ (పన్నులు కాకుండా) అందిస్తోన్నట్లు తెలిపింది. సోమవారం ప్రారంభమైన ఈ సేల్ డిసెంబర్ 31 అర్ధరాత్రి దాకా నాలుగు రోజుల పాటు అందుబాటులో ఉంటుంది.
దీని కింద దేశీ రూట్లలో ప్రయాణానికి సంబంధించి ఒక వైపు ప్రయాణాలకు ఈ తగ్గింపు బేస్ రేటు ఆఫరు వర్తిస్తుందని స్పైస్‌జెట్ పేర్కొంది. దీని కింద తీసుకున్న టికెట్లకు రీఫండబుల్ (పన్నులు, ఫీజులు మాత్రమే) సదుపాయంతో పాటు నిర్దిష్ట మొత్తం చెల్లించి మార్చుకునే వీలు కూడా కల్పిస్తున్నట్లు వివరించింది.