డౌన్‌లోడ్స్‌లో దూసుకుపోయిన మైజియో

డౌన్‌లోడ్స్‌లో దూసుకుపోయిన మైజియో

రిలయన్స్‌ జియోకి ముఖ్యమైన మొబైల్‌ అప్లికేషన్‌ 'మైజియో' కి పెరుగుతున్న క్రేజీ అంతా ఇంతా కాదు. గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఈ యాప్‌ 100 మిలియన్‌(10 కోట్ల) మార్కును దాటేసింది. వీడియో స్ట్రీమింగ్‌ సర్వీసు హాట్‌స్టార్‌ తర్వాత గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ఇంతలా డౌన్‌లోడ్‌ అయిన రెండో దేశీయ అప్లికేషన్‌ ఇదే కావడం విశేషం. ఈ అప్లికేషన్‌కు యావరేజ్‌గా 4.4 స్టార్‌ రేటింగ్‌ ఉంది. జియో సబ్‌స్క్రైబర్లందరికీ ఇది కామన్‌ ప్లాట్‌ఫామ్‌. జియో కనెక్షన్‌ చెక్‌ చేసుకోవడానికి, డేటా వాడకం తెలుసుకోవడం కోసం ఇది ఎంతో సహకరిస్తోంది. దిగ్గజ టెలికాం ఆపరేటర్లు- ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఇండియా, ఐడియా సెల్యులార్‌ల సెల్ఫ్‌-కేర్‌ అప్లికేషన్‌ కూడా గూగుల్‌ ప్లే స్టోర్‌లో 10 మిలియన్‌(కోటి) పైగా డౌన్‌లోడ్లను నమోదుచేసింది. 

 

రిలయన్స్‌ జియో టీవీ యాప్‌, జియో టీవీ కూడా 50 మిలియన్‌(5 కోట్ల) డౌన్‌లోడ్లను రికార్డు చేసినట్టు వెల్లడైంది. కాగ, ఎయిర్‌టెల్‌ టీవీ యాప్‌ 5 మిలియన్ పైగా డౌన్‌లోడ్‌లు, వొడాఫోన్‌, ఐడియాలకు ఒక్కో దానికి 1 మిలియన్‌కు పైగా డౌన్‌లోడ్‌లను కలిగి ఉన్నట్టు తెలిసింది. జీరోకే జియో ఫోన్‌ లాంచింగ్‌తో టెలికాం వ్యాపారాల్లో రిలయన్స్‌ జియో మరింత మార్కెట్‌ షేరును విస్తరించేందుకు చూస్తోంది. ప్రస్తుతం మార్చి నెలలో 9.9 మార్కెట్‌ షేరును జియో కలిగి ఉంది. అంతేకాక టీవీ మార్కెట్‌లోనూ దేశవ్యాప్తంగా 15 స్థానిక భాషల్లో 432 లైవ్‌ ఛానల్స్‌ను జియో టీవీ యాప్‌ ఆఫర్‌ చేస్తోంది. తమ యూజర్లకు జియో టీవీ సర్వీసులను అందించేందుకు హాట్‌స్టార్‌తో ఇది భాగస్వామ్యం కూడా ఏర్పరుచుకుంది. 
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top