దక్షిణాది ఆర్థిక మంత్రుల భేటీ నేడే

Meeting of Finance Ministers of Southern States  - Sakshi

15వ ఆర్థిక సంఘం సిఫారసులపై చర్చ

తిరువనంతపురం: దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం మంగళవారం కేరళలోని తిరువనంతపురంలో జరగనుంది. దీన్ని కేరళ రాష్ట్రం ఏర్పాటు చేస్తోంది. 15వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు నిధుల కేటాయింపులకు గాను 2011 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకోవడంపై దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌ (టీఓఆర్‌)లో చేసిన మార్పుల కారణంగా దక్షిణాది రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని కేరళ రాష్ట్ర ఆర్థిక మంత్రి టీఎం థామస్‌ ఇజాక్‌ అన్నారు. ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చి జాతీయ స్థాయిలో దీనిపై చర్చ జరిగేలా చూడడమే తమ భేటీ ఉద్దేశమని ఆయన చెప్పారు. దేశంలో సమాఖ్య వ్యవస్థ విధానానికి టీవోఆర్‌ వ్యతిరేకంగా ఉందన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొంటున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top