2020 నాటికి మారుతీ ఎలక్ట్రిక్‌ కారు!!

Maruti electric car by 2020 - Sakshi

న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ ‘మారుతీ సుజుకీ’.. 2020 నాటికి తొలి ఎలక్ట్రిక్‌ కారును మార్కెట్‌లోకి తీసుకురావాలని భావిస్తోంది. ఎలక్ట్రిక్‌ వాహనాలను అందుబాటు ధరలో తీసుకువచ్చేందుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అవసరమౌతాయని కంపెనీ పేర్కొంది. ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఈవీలు)పై 2–3 వారాల్లో సొంతంగా ఒక సర్వే నిర్వహిస్తామని, కన్సూమర్ల అభిప్రాయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని తెలిపింది.

అందుబాటు ధరలో ఎలక్ట్రిక్‌ వాహనాలను తీసుకురావడమనేది పరిశ్రమ ముందున్న అతిపెద్ద సవాలని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్‌ ఆర్‌.సి.భార్గవ పేర్కొన్నారు. ఈవీల బ్యాటరీలు, ఇతర వాహన విడిభాగాలను దేశీయంగానే తయారు చేయగలిగితే ఈ సమస్యను అధిగమించొచ్చని తెలిపారు. ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వ మద్దతు అవసరమని అభిప్రాయపడ్డారు.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top