లాభాల ప్రారంభం : అమ్మకాల ఒత్తిడి

Markets slips from highs - Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లుభారీ లాభాలతో ప్రారంభమయ్యాయి.  కానీ  కేవలం నిమిషాల వ్యవధిలోనే  అమ్మకాల ఒత్తిడితో ప్రారంభ లాభాలనుంచి  ఫ్లాట్‌గా మారాయి.  150పాయింట్లకు పైగా ఎగిసిన  సెన్సెక్స్‌ 71 పాయింట్ల లాభానికి పరిమితమై 38714వద్ద, నిఫ్టీ 9 పాయింట్ల స్వల్ప లాభంతో 11688 వద్ద కొనసాగుతోంది. ఐటీ ఫార్మ, లాభాల్లో ఉండగా, బ్యాంకింగ్‌  సెక్టార్‌ నష్టపోతోంది.  అలాగే  వర్షాలు వరదల కారణంగా వాహనాల అమ్మకాలు క్షీణించిన నేపథ్యంలో  మారుతి నష్టపోతోంది. ఐసీఐసీఐ, రిలయన్స్‌ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.  విప్రో, లుపిన్‌, డా.రెడ్డీస్‌, ఐషర్‌ మోటార్స్‌, అశోక్‌ లేలాండ్‌ ,ఎం అండ్‌ ఎం, టాటా మోటార్స్‌,  అంబుజా సిమెంట్‌ లాభపడుతున్నాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top