స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌

Markets Ends Volatile Session With Moderate Gain - Sakshi

ముంబై : ఆరంభంలో దూకుడు పెంచిన స్టాక్‌ మార్కెట్లు భారత జీడీపీ వృద్ధిపై బుధవారం అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం ఫిచ్‌ వెల్లడించిన అంచనాలతో డీలా పడ్డాయి. భారీ లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌, నిఫ్టీ అటు తర్వాత అమ్మకాల ఒత్తిడితో ఆరంభ లాభాలను కోల్పోయాయి.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 66 పాయింట్ల లాభంతో 40,000 పాయింట్ల దిగువన 39,113 పాయింట్ల వద్ద ముగియగా,  ఫ్లాట్‌గా ముగిసిన నిఫ్టీ 11,691 పాయింట్ల వద్ద క్లోజయింది. ఇక టాటా స్టీల్‌, కొటాక్‌ బ్యాంక్‌, ఎన్టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, పవర్‌గ్రిడ్‌ షేర్లు లాభపడ్డాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top