బేర్‌కు బ్రేక్‌ : మార్కెట్‌ రికవరీ

Market Ends Multi Day Losing Streak - Sakshi

ముంబై : హమ్మయ్యా.. బేర్‌ బెంబేలెత్తించడం ఆపింది. స్టాక్‌ మార్కెట్‌ భారీ పతనం నుంచి కోలుకుంది. భారీ నష్టాలను తట్టుకోలేక, సంపదను పోగొట్టుకుంటున్న ఇన్వెస్టర్లు చివరికి ఊపిరి పీల్చుకున్నారు. చివరి గంటలో జరిగిన ట్రేడింగ్‌ మార్కెట్‌కు షార్ప్‌ రికవరీ ఇచ్చింది. గతవారమంతా భారీగా కుదేలైన మార్కెట్‌, నేడు కూడా తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. కానీ చివరి గంటలో ఫైనాన్సియల్‌ షేర్లు కోలుకోవడంతో, సెన్సెక్స్‌, నిఫ్టీ లాభాల బాటలో నడిచాయి. సెన్సెక్స్‌ 97 పాయింట్లు పెరిగి 34474 వద్ద క్లోజ్‌ కాగా, నిఫ్టీ 32 పాయింట్ల లాభంలో 10348 వద్ద ముగిసింది.

స్టాక్‌ మార్కెట్‌కు హెవీ ఇండెక్స్‌ షేర్లుగా ఉన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, కొటక్‌ మహింద్రా బ్యాంక్‌ నేటి ట్రేడింగ్‌కు బూస్ట్‌ ఇచ్చింది. ఎనర్జీ, బ్యాంక్‌లు, ఆటో షేర్లు టాప్‌ గెయినర్లుగా లాభాల పంట పండించాయి. హిందూస్తాన్‌ పెట్రోలియం, యస్‌ బ్యాంక్‌, ఇండియన్‌ ఆయిల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హీరో మోటోకార్ప్‌ 4.8 శాతం నుంచి 8.5 శాతం మధ్యలో లాభపడ్డాయి. మరోవైపు మెటల్స్‌, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ షేర్లు ఎక్కువగా నష్టాలు పాలయ్యాయి. నాల్కో, ఏపీఎల్‌, అపోలో ట్యూబ్స్‌, హిందుస్తాన్‌ జింక్‌ 3.7 శాతం నుంచి 10.5 శాతం వరకు నష్టపోయాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 74 వద్ద కనిష్ట స్థాయిల్లో ట్రేడవుతోంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top