పెట్టుబడి సాధనంగా మెరుపు తగ్గుతున్న బంగారం

Lightning falls as an investment tool - Sakshi

న్యూఢిల్లీ: ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనంగా బంగారం తన ఆకర్షణను కోల్పోతోంది. 2016 నుంచి చూస్తే ఈ ఏడాది జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికం బంగారానికి చాలా చెత్త పనితీరుగా ఉండిపోతుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ డీబీఎస్‌ పేర్కొంది. బంగారం ధరలు పెరిగేందుకు తక్షణ ఉత్ప్రేరకం ఏదీ లేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ ఏడాది మార్చి నెలలో 1.38 మిలియన్‌ డాలర్లు, జూన్‌లో 1,420 మి.డాలర్ల పెట్టుబడులు పసిడి ఈటీఎఫ్‌ల్లోకి రాగా, జూలైలో 1,530 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు బయటకు వెళ్లిపోయా యి.

ఈ ఏడాది రెండో భాగం (జూలై–డిసెంబర్‌)లో ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడుల రాక ప్రతికూలంగానే ఉంటుందని, సమీప కాలంలో బంగారం ధరల బలహీనతకు ఇది దారితీస్తుందని డీబీఎస్‌ వివరించింది. ఔన్స్‌ బంగారం ధర ఏప్రిల్‌ 11న రికార్డు స్థాయి 1,353 డాలర్ల  స్థాయికి చేరగా, ఆగస్ట్‌ 16న 1,174 డాలర్లకు పడిపోయింది. డాలర్‌ బలోపేతం, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, వాణిజ్య యుద్ధం వంటివి ఇందుకు కారణం. వర్ధమాన కరెన్సీలు బలపడటంతో ఆభరణాల డిమాండ్‌ తగ్గింది. ‘‘పుత్తడి ధరల్ని డిసెంబర్‌ క్వార్టర్‌లో 1,200 డాలర్లు ఉంటుందని అంచనా. 2019లోనూ పసిడి మార్కెట్లో మిగులు కారణంగా పనితీరు బలహీనంగానే ఉంటుంది’’అని డీబీఎస్‌ తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top