మలబార్‌ గోల్డ్‌పై తప్పుడు ప్రచారం.. దోషికి శిక్ష

మలబార్‌ గోల్డ్‌పై తప్పుడు ప్రచారం.. దోషికి శిక్ష


హైదరాదాద్‌: మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ పాకిస్తాన్‌ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుందనే ఫొటోలను ప్రచారం చేసిన వ్యక్తికి దుబాయ్‌ న్యాయస్థానం తగిన శిక్ష విధించింది. కోర్టు అది తప్పుడు ప్రచారమని పేర్కొంటూ.. ఈ పనికి పాల్పడ్డ బినిష్‌ పున్నాకల్‌ ఆరుముగన్‌కి బహిష్కరణతోపాటు రూ.44.68 లక్షల జరిమానా విధించిందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ‘సోషల్‌ మీడియాను ఉపయోగించుకొని సంస్థలు/వ్యక్తుల కీర్తిప్రతిష్టలను దెబ్బతీయాలని ప్రయత్నించే వారికి ఈ తీర్పు ఒక గుణపాఠం.


ప్రతివాది మమల్ని క్షమాపణ కోరిన వెంటనే మేం కేసును వెనక్కు తీసుకున్నాం. కానీ దుబాయ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ ఈ కేసును కొనసాగించింది. తక్కువ వ్యవధిలో ఉత్తమమైన తీర్పు వెలువరించినందుకు దుబాయ్‌ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం’ అని మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ ఇంటర్నేషనల్‌ ఆపరేషన్స్‌ ఎండీ షామ్‌లాల్‌ అహ్మద్‌ పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top