మహిళల ముంగిట్లో డిజిటల్‌ సేవలు : జియో

Jio Furthers Its Commitment To Reduce Gender Gap In Digital Adoption - Sakshi

ముంబై : భారత మహిళలకు డిజిటల్‌ అక్షరాస్యత, డిజిటల్‌ సౌకర్యాలను చేరువ చేసేందుకు అతిపెద్ద మొబైల్‌ డేటా నెట్‌వర్క్‌ జియో, జీఎస్‌ఎంఏ కనెక్టెడ్‌ వుమెన్‌ ఇనీషియేటివ్‌తో చేతులు కలిపినట్టు జియో ప్రకటించింది. మొబైల్‌ ఫోన్లు, డేటా వాడకం, డిజిటల్‌ సేవలు పొందడంలో జెండర్‌ గ్యాప్‌ను నిరోధించేందుకు తమ భాగస్వామ్యం ఉపకరిస్తుందని వెల్లడించింది.

భారత్‌లో మొబైల్‌ సేవలు పొందడంలో పురుషులతో దీటుగా మహిళలు ముందుకు వెళ్లలేకపోతున్నారని, ఆ సేవలు యాక్సెస్‌ లేకపోవడం, అందుబాటు ధరలు కొరవడటం, డిజిటల్‌ విప్లవంలో సమ్మిళిత వృద్ధి లోపించడం వంటి కారణాలున్నాయని, జియో ఆవిర్భావం నుంచే వీటిని అధిగమించడం జరిగిందని తెలిపింది. ఇక​ డిజిటల్‌ ఇంక్లూజన్‌పై జియో దృష్టిసారించిందని, గత దశాబ్ధకాలంగా మొబైల్‌, ఇంటర్‌నెట్‌ టెక్నాలజీల పెరుగుదల మహిళా సాధికారత, ఐటీ విద్యావ్యాప్తికి ఉపకరించిందని రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ డైరెక్టర్‌ ఇషా అంబానీ పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top