జెట్‌ ఎయిర్‌వేస్‌ ఫౌండర్‌కు మరో ఎదురు దెబ్బ

Jet Airways founder Naresh Goyal cant leave India - Sakshi

జెట్‌ ఎయిర్‌వేస్‌ ఫౌండర్‌ నరేష్‌ గోయల్‌కు ఎదురు దెబ్బ

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి నిరాకరణ

విదేశాలకు వెళ్లాలనుకుంటే రూ. 18వేల కోట్లు డిపాజిట్‌ చేయండి - ఢిల్లీ హైకోర్టు 

సాక్షి, న్యూఢిల్లీ : జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేష్‌ గోయల్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. విదేశాలకు వెళ్లేందుకు గోయల్‌ పెట్టుకున్న అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. గ్యారంటీ సొమ్ము చెల్లించకుండా దేశం విడిచి వెళ్లరాదని ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఆదేశించింది. ఒకవేళ దేశం విడిచి విదేశాలకు వెళ్లాలనుకుంటే 18వేల కోట్ల  రూపాయలను డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. ప్రస్తుత పరిస్థితుల్లో తాత్కాలిక ఊరట కల్పించలేమని న్యాయమూర్తి సురేష్‌ కైత్‌ స్పష్టం చేశారు.  

తనపై జారీ చేసిన లుక్ అవుట్ సర్కులర్ను సవాల్ చేస్తూ, దేశం విడిచి వెళ్లడానికి కోర్టు అనుమతిని కోరుతూ గోయల్ చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. అలాగే దీనిపై సమాధానం ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. కాగా గోయల్‌ ఆయన భార్య అనిత దుబాయ్‌కు వెళుతుండగా మార్చి 25 న విమానాన్ని దింపివేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రభుత్వ రంగబ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపార వేత్త విజయ్‌ మాల్యా,  డైమండ్‌ వ్యాపారి నీరవ్‌మోదీని స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో నరేష్‌ గోయల్‌కు తాజా షాక్‌ తగిలింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top