జెట్‌ ఎయిర్‌వేస్‌ లాభం 46 శాతం డౌన్‌ 

Jet Airways down 46 per cent - Sakshi

రూ. 6,349 కోట్లకు  మొత్తం ఆదాయం

న్యూఢిల్లీ: విమానయాన సంస్థ, జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలానికి రూ.165 కోట్ల నికర లాభం(స్డాండెలోన్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం (రూ.305 కోట్లు)తో పోల్చితే 46 శాతం క్షీణించిందని జెట్‌ ఎయిర్‌వెస్‌ తెలిపింది. అధిక వ్యయాల కారణంగా నికర లాభం తగ్గిందని తెలిపింది.  మొత్తం ఆదాయం మాత్రం రూ.5,941 కోట్ల నుంచి రూ.6,349 కోట్లకు పెరిగిందని వివరించింది.  

మొత్తం వ్యయాలు రూ.5,635 కోట్ల నుంచి రూ.6,184 కోట్లకు పెరిగాయని జెట్‌ ఎయిర్‌వేస్‌ తెలిపింది. కరెన్సీ ఒడిదుడుకుల కారణంగా గత క్యూ3లో రూ.190 కోట్ల నష్టాలు రాగా, ఈ క్యూ3లో రూ.142 కోట్ల లాభం వచ్చిందని పేర్కొంది. నిర్వహణ ఆదాయం రూ. 8 కోట్ల నుంచి రూ.128 కోట్లకు పెరిగిందని తెలిపింది.  
ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్‌ 2.1 శాతం నష్టపోయి రూ. 803 వద్ద ముగిసింది.    

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top