జే అండ్‌ కే బ్యాంకులో భారీ అక్రమాలు

J and K Bank Chief Unearths Many Financial Irregularities Illegal Appointments - Sakshi

శ్రీనగర్‌:  జమ్ము అండ్‌ కాశ్మీర్‌ బ్యాంక్‌లో  కోట్ల రూపాయల అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. అవినీతి ఆరోపణలతో జే అండ్‌కే బ్యాంక్‌ ఎండీ, చైర్మన్‌ పర్వేజ్‌ అహ్మద్‌ నెంగ్రో ప్రభుత్వం తప్పించిన అనంతరం  షాకింగ్‌ విషయాలను దర్యాప్తు సంస్థలు కనుగొన్నాయి.  నిబంధనలను విరుద్ధంగా   అక్రమ రుణాలు  మంజూరు, అనేక  నకిలీ ఒప్పందాలు,   బంధువులకు అక్రమ నియామకాలు తదితర అక్రమాలను అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి 300కు పైగా ఫైళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

అక‍్రమ నియామకాలు, అక్రమ రుణాలు : పీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఇమ్రాన్ అఫ్తాబ్ అన్సారీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ చీఫ్ సజ్జాద్ సిఫారసు మేరకు అక్రమ రుణాలను మంజూరు చేసినట్టు ఏసీబీ ఆరోపిస్తోంది. వందలాది బ్యాంకు శాఖల పునర్నిర్మాణం కోసం రూ. 50 లక్షల నుంచి రూ.1.5 కోట్లు కేటాయించినట్టు  రికార్డుల్లో చూపారు. కానీ  అసలు ఇందులో కేవలం 30శాతం మాత్రమేనట.  అలాగే రాయల్‌ స్ర్పింగ్‌ గోల్డ్‌ కోర్స్‌ సుందరీకీకరణకోసం ఏకంగా రూ. 8 కోట్లను వెచ్చించినట్టు తెలుస్తోంది.  పర్వేజ్‌  మన మేనల్లుడికి కీలక పదవిని కట్టబెట్టారు. కోడలు షాజియాను ప్రొబేషనరీ  ఆఫీసర్‌గా నియమించారు. ప్రస్తుతం ఈమె  హజరత్‌ బాల్‌ బ్రాంచ్‌కు మేనేజర్‌గా ఉన్నారు. 

ఏసీబీ షాక్‌ : జమ్ము కాశ్మీర్‌ బ్యాంక్‌ చైర్మన్‌ పర్వేజ్‌ అహ్మద్‌ను తొలగించిన కొన్ని నిమిషాలలోనే ఆ బ్యాంక్‌ ప్రధాన కార్యాయలయంపై రాష్ట్ర విజిలెన్స్‌ అధికారులు శనివారం​ దాడులు నిర్వహించారు. గతంలో పిడిపి-బిజెపి కూటమి ప్రభుత్వ హయాంలో రాజకీయ నేతల ప్రమేయంతో ఫర్వేజ్‌ సుమారు 1,200 మందిని ఉద్యోగాలలో నియ మించినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంపై అధికారులు ఈ దాడులు నిర్వహించారు.  చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినట్లు యాంటీ కరెప్షన్‌ బ్యూరో(ఏసీబీ) అధికారులు  పర్వేజ్‌ అహ్మద్‌పై కేసు నమోదు  చేశారు.  అలాగే బ్యాంక్‌ మధ్యంతర చైర్మన్‌, ఎండీగా ఆర్‌కే చిబ్బర్‌ను ప్రభుత్వం ఎంపిక చేసినట్లు జేఅండ్‌కే బ్యాంక్‌ బీఎస్‌ఈకి వెల్లడించిన సంగతి తెలిసిందే.  ఈ వార్తల నేపథ్యంలో  సోమవారం  జే అండ్‌కే బ్యాంక్‌  షేరు 22 శాతం పతనమైంది.

ఒమర్‌, మెహబూబా స్పందన: అటు కేంద్ర ప్రభుత్వ చర్యపై నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా, కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ  స్పందించారు. అవినీతికి, అక్రమాలకు  వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాల్సిందే. కానీ బ్యాంకుల్లో రాజకీయాలకు తావులేకుండా అడ్మినిస్ట్రేషన్ జాగ్రత్త పడాలని ట్వీట్‌ చేశారు   ఛైర్మన్‌ను తొలగించడం విచారకరమని మాజీ సీఎం ట్వీట్‌ చేశారు.  అవినీతిని అడ్డుకునేందుకు ఇంతకంటే మంచి మార్గాలు చాలా వున్నాయని ఆమె పేర్కొన్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top