షావోమికి షాక్‌: రెండు కొత్త స్మార్ట్‌ఫోన్స్‌

Infinix Zero 5, Zero 5 Prowith FHD display launched in India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: చైనా కంపెనీకి షాకిస్తూ ఇటీవల భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి  రంగ ప్రవేశం చేసిన  హాంగ్‌కాంగ్‌కు చెందిన ఇన్ఫినిక్స్  మరో  రెండుకొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది.  రాన్‌సన్‌ హోల్డింగ్స్ యాజమాన్యంలోని ఇన్ఫినిక్స్‌  మూడు నెలల క్రితం బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌లను భారతదేశంలో అందుబాటులోకి తెచ్చిన  సంస్థ తాజాగా  మిడి సైజ్‌ సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.   జీరో 5, జీరో 5 ప్రో  పేరుతో  రెండు  డివైస్‌లను లాంచ్‌ చేసింది. భారీ డిస్‌ప్లే, డ్యూయల్‌ రియర్‌ కెమెరా,  అద్భుతమైన ఫీచర్లు హైలైట్‌గా నిలవనున్నాయి.   జీరో 5 ధర రూ .17,999గాను జీరో 5 ప్రో రూ .19,999 గా  నిర్ణయించింది.  అయితే ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల ఫీచర్లు ఒకేలా ఉండగా ..జీరో 5 ప్రోను  భారీ స్టోరేజ్‌ (128 జీబీ) తో విడుదల చేసింది.  విభిన్న రంగుల్లో ఫ్లిప్‌కార్ట్‌లో ఇవి ప్రత్యేకంగా లభించనున్నాయి.

ఇన్ఫినిక్స్ జీరో 5 ఫీచర్లు
5.98-అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ నౌగట్‌ 7.0
6జీబీ ర్యామ్‌
64 జీబీ స్టోరేజ్‌
128దాకా విస్తరించుకునే అవకాశం
12మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్
13మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్
16మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

4350ఎంఏహెచ్‌ బ్యాటరీ

Back to Top