భారీ డీల్‌: ఐడియా టవర్‌ బిజినెస్‌ విక్రయం

Idea to sell ICISL for EV of Rs 4,000 crore to ATC Telecom - Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ టెలికాం సంస్థ ఐడియా  ఒక కీలక  ఒప్పందాన్ని చేసుకుంది.  తన స్వతంత్ర టవర్‌ బిజినెస్‌ను  ఏటీసీ  టెలికాంకు  విక్రయిస్తోంది.  సుమవారు రూ. 4వేలకోట్ల  విలువైన ఈడీల్‌ కుదర్చుకుంది.  రూ. 4వేలకోట్ల   ఐడియాకు చెందిన  ఐసీఐఎఎస్‌ఎల్‌ (ఐడియా సెల్యులాయర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక‍్చర్‌ లిమిటెడ్‌) ను ఏటీసికి విక్రయిస్తోంది.  ఈ మేరకు  ఐడియా  బోర్డు  అనుమతిని ఇచ్చింది. టవర్‌ బిజినెస్‌నుంచి బయటికి వచ్చే వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.

 ఈ డీల్‌ తో  అప్పులను తగ్గించేందుకు నిర్ణయించినట్టు ఐడియా ఎండీ హిమాంశు కల్పానియా  తెలిపారు.  తద్వారా  బ్రాండ్‌  బ్యాండ్‌ సర్వీసులను మరింత విస్తరించనున్నట్టు  చెప్పారు.

మరోవైపు టవర్‌ బిజినెస్‌ విక్రయం వార్తలతో ఆరంభంలో 5శాతంపైగా లాభపడిన ఐడియా కౌంటర్‌ తరువాత నష్టాల్లోకి మళ్లింది. 3 శాతానికిపైగా నష్టంతో ట్రేడ్‌ అవుతోంది.

Tags: 
Back to Top