ఆధార్‌ను ఎక్కడెక్కడ వాడారో తెలుసుకోండి ఇలా...

How to check where all your Aadhaar card has been used in the last six months - Sakshi

న్యూఢిల్లీ : ఇప్పుడు ప్రతి పనికి ఆధార్‌ అవసరం పెరిగిపోయింది. ఆధార్‌ వివరాలు సమర్పించనిదే.. ఏ పని జరగడం లేదంటే ఆశ్చర్యపోవాల్సినవసరం లేదు. అయితే ఆధార్‌ కార్డును ఇంతలా వాడుతున్నాం కదా... అది ఎక్కడైనా దుర్వినియోగం అయ్యే అవకాశాలున్నాయా? అనే సందేహం ప్రతి ఒక్కరికి వస్తుంది. ఈ క్రమంలో ఆధార్‌ ప్రమాణీకరణను ఇంట్లోనే కూర్చునే కనుగొనే విధానాన్ని యూఐడీఏఐ తీసుకొచ్చింది. అంటే గత ఆరు నెలల కాలంలో ఎక్కడెక్కడ ఆధార్‌ను వాడామో తెలుసుకోవచ్చన్నమాట. ఒకవేళ ఏమైనా దుర్వినియోగమైనట్టు గుర్తిస్తే.. వెంటనే ఫిర్యాదు కూడా చేయొచ్చు. ఈ ఫీచర్‌ను ఆన్‌లైన్లో సద్వినియోగం చేసుకోవడానికి కచ్చితంగా రిజిస్ట్రర్‌ మొబైల్‌ నెంబర్‌ ఉండాలి. అయితే ఏ విధంగా ఆధార్‌ ప్రమాణీకరణను చెక్‌ చేసుకోవచ్చో తెలుసుకోండి ఇలా.... 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top