రాష్ట్రాల ఆదాయానికి జీఎస్‌టీ ఊతం

GST 'anti-profiteering' receipts to be split between Centre, states - Sakshi

ముంబై: జీఎస్‌టీతో పన్ను రాబడులు మెరుగుపడటం, చమురు ధరలు పెరగడం తదితర అంశాల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రాష్ట్రాలకు రూ. 37,426 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరనుంది. ఎస్‌బీఐ రీసెర్చ్‌ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. నివేదిక ప్రకారం.. 2018 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల ఆదాయం అదనంగా రూ. 18,698 కోట్ల మేర పెరిగింది.

ఇక, పెరిగిన చమురు ధరల ప్రభావాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఇది రూ. 37,426 కోట్ల పైచిలుకు ఉంటుందని ఎస్‌బీఐ రీసెర్చ్‌ తెలిపింది. గతేడాది జూలైలో జీఎస్‌టీ అమల్లోకి వచ్చినప్పట్నుంచీ పన్నుల పరిధిలోకి మరింత జనాభా రావడం, పన్నులను సక్రమంగా చెల్లించడం పెరగడం వంటి అంశాలతో పలు రాష్ట్రాలకు ట్యాక్స్‌ల ద్వారా వచ్చే ఆదాయాలు గణనీయంగా పెరిగాయి.
స్వల్ప లాభాలతో సరి

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top