ఎయిరిండియా భవనం జేఎన్‌పీటీ చేతికి?

Govt plans to sell Air India building in Mumbai to JNPT - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా విమానయాన సంస్థ ‘ఎయిరిండియా’కు చెందిన ముంబైలోని భవనాన్ని విక్రయించడానికి రెడీ అయ్యింది. దీనికోసం  జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్ట్‌ ట్రస్ట్‌ (జేఎన్‌పీటీ)తో చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ విక్రయ ప్రతిపాదనకు ప్రధాని మోదీ నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. భవనం విలువను లెక్కించేందుకు పౌర విమానయాన, షిప్పింగ్‌ శాఖలకు చెందిన పలువురు కార్యదర్శులతో ఒక అంతర మంత్రిత్వ శాఖ ప్యానెల్‌ ఏర్పాటయ్యిందని కూడా పేర్కొన్నాయి. 

ఎయిరిండియాకు చెందిన 23 అంతస్తుల భవనం ముంబైలోని నారిమన్‌ పాయింట్‌ వద్ద ఉంది. ఒకప్పుడు ఇది సంస్థ ప్రధాన కార్యాలయంగా కూడా ఉండేది. సంస్థకు చెందిన ప్రధానమైన ప్రాపర్టీల్లో ఇది కూడా ఒకటి. దీని విలువ అధిక స్థాయిల్లో ఉండొచ్చని అంచనా. ఎయిరిండియా వ్యూహాత్మక డిజిన్వెస్ట్‌మెంట్‌ చర్యలు విఫలమైన నేపథ్యంలో ఈ ప్రాపర్టీ విక్రయం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఎయిరిండియా రుణ భారం రూ.50,000 కోట్లపైమాటేనని అంచనా.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top