పసిడి మెరుపులు

Gold prices  trades higher

సాక్షి, ముంబై:  స్వదేశీ, విదేశీ మార్కెట్లో బంగారం ధరలు మెరుస్తున్నాయి.  ముఖ్యంగా  గ్లోబల్‌గా ఔన్స్‌బంగారం ధర 1300 డాలర‍్లను అధిగమించింది.   న్యూయార్క్‌ కామెక్స్‌లో  ఔన్స్‌(31.1 గ్రాములు) పసిడి 0.25 శాతం బలపడి 1307 డాలర్లను తాకింది. వెండి సైతం ఔన్స్‌ 0.15 శాతం పెరిగి 17.5 డాలర్ల వద్ద  రెండు వారాల గరిష్టాన్ని నమోదు చేశాయి. అమెరికా  అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  ట్విట్టర్ పోస్ట్ తరువాత రష్యా  చైనా రెండూ ఉత్తర కొరియాపై నిగ్రహం కోసం పిలుపునివ‍్వడంతో స్పెయిన్ , ఉత్తర కొరియాలో బలహీనమైన డాలర్ ఇండెక్స్  బలహీనపడింది. అలాగే భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు బంగారు ర్యాలీకి మద్దతునిచ్చాయి.
ఇరాన్‌ అణుఒప్పందంపై అమెరికా ప్రతికూలతలు, ఇరాక్‌ - కుర్ధిష్‌ ప్రాంతాల మధ్య విభేధాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలకు తెరతీసినట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.  డాలర్‌ బలహీనత  పుత్తడి ధరలకు జోష్‌ పెంచిందని జార్జెట్‌  బోయిలే పేర్కొన్నారు.  అయితే  సమీప భవిష్యత్తులో భారీ మార్పులు ఉండవబోవని తెలిపారు. దీంతో సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పుడు రక్షణాత్మక పెట్టుబడిగా భావించే బంగారంలో కొనుగోళ్లు ఊపందుకున్నట్లు ఎనలిస్టులు భావిస్తున్నారు.
ఇదే ప్రభావం దేశీయంగాకూడా  బంగారం ధరలపై ప్రభావాన్ని చూపిస్తోంది.  దీనికి  తోడు దేశీయంగా  వెడ్డింగ్‌ సీజన్‌,  పండుగల నేపథ్యంలో బంగారంలో కొనుగోళ్లు పుంజుకున్నాయి. దేశీయంగా ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ఫిబ్రవరి ఫ్యూచర్స్‌  రూ. 29,950ను తాకగా.. డిసెంబర్‌ డెలివరీ రూ. 24 పెరిగి రూ. 29,875కు చేరింది.  మరో రెండు నెలలపాటు  పెళ్లిళ్ల సీజన్‌ డిమాండ్‌ కొనసాగనుందని ప్రముఖ ఎనలిస్టులు పేర్కొన్నారు. ముఖ్యంగా   డైమండ్‌ నగల  కొనుగోళ్లు పుంజుకుంటున్నట్టు వ్యాపార వర్గాలు తెలిపాయి.  మరోవైపు ప్రముఖ  బ్రోకరేజ్‌ సంస్థ మోతీలాల్‌  వోస్వాల్‌  బంగారంలో బై కాల్‌ ఇస్తోంది.  
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top