పడిపోతున్న బంగారం ధర

Gold Prices Fall By Rs. 360 On Subdued Demand - Sakshi

వరుసగా 6వ రోజూ దిగి వచ్చిన బంగారం 

గురువారం రూ.360  పడిపోయింది

సాక్షి, న్యూఢిల్లీ:  దేశీయ మార్కెట్లో బంగారం ధరలు గురువారం మరింత  పతనమయ్యాయి.  బులియన్ మార్కెట్లో వరుసగా 6వ రోజు కూడా బలహీన పడిన  10 గ్రాముల బంగారం ధర  ఈ రోజు రూ.360లు క్షీణించింది.  10గ్రా.  పసిడి ధర  33,070 రూపాయలు పలుకుతోంది.  వెండి ధర రూ. 520  పతనమై  కిలో రూ. 38,980 గా ఉంది. 

దేశ రాజధానిలో 99.9 శాతం  స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారంధర  రూ. 33,070 ,  99.5 శాతం ప్యూరిటీ గోల్డ్‌ ధర రూ. 32,900గా ఉంది.  మరోవైపు అంతర్జాతీయంగా స్పాట్ బంగారం ఔన్స్‌ ధర 1,284.77 డాలర్లుగా ఉంది.  అదేవిధంగా వెండి న్యూయార్క్‌లో ఒక ఔన్స్15.06  డాలర్లు స్థాయికి పడిపోయింది.

విదేశీ బలహీన ధోరణి ,  స్థానిక నగల వర్తకులనుంచి డిమాండ్‌ క్షీణించడం  దేశీయ మార్కెట్లో  పుత్తడి ధరలు పడిపోయాయని వర్తకులు తెలిపారు.  అలాగే డాలరుమారకంలో దేశీయ కరెన్సీ రూపాయి  బలపడుతూ వుండటం  కూడా   పసిడి ధరలపై ఒత్తడి పెంచినట్టు అంచనావేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top