క్షీణించిన పసిడివెలుగులు

క్షీణించిన పసిడివెలుగులు - Sakshi


ముంబై: ఈ ఏడాది బంగారం ధగధగలు లేవు. పసిడి వెలుగులు బాగా క్షీణించాయి. గత ఏడాదితో పొల్చితే ఈ ఏడాది పది గ్రాముల బంగారం ధర 1400 రూపాయల వరకు తగ్గింది. ఈ ఏడాది ఒక దశలో పది గ్రాముల ధర 25 వేల రూపాయలకు పడిపోతుందా? అని అనిపించింది.  2013 డిసెంబరు 31న ఎంసీఎక్స్లో 10 గ్రాముల ధర 28 వేల 300 రూపాయలు ఉంది. ఈ రోజు 26,900 రూపాయలు ఉంది.



గత ఏడాది ఇదే రోజుతో పోల్చితే 10 గ్రాముల ధర 1400 రూపాయలకు పడిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో బంగారం కొన్న వారికి నష్టాలే మిగులుతాయి. 2015ను కూడా బంగారానికి కలసివచ్చే అవకాశంలేదని నిపుణుల అంచనా.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top