పసిడి రుణ పరిశ్రమ భారీ వృద్ధి: కేపీఎంజీ

The gold industry is a huge growth - Sakshi

2020 నాటికి రూ.రూ. 3.1 లక్షల కోట్లకు

న్యూఢిల్లీ: దేశంలో వ్యవస్థీకృత పసిడి రుణ పరిశ్రమ 2019–20 నాటికి భారీగా వృద్ధి చెందుతుందని ఆర్థిక సేవల సంస్థ– కేపీఎంజీ తాజా నివేదిక అంచనావేసింది. 2016–17లో రూ. 2.13 లక్షల కోట్లుగా ఉన్న ఈ పరిశ్రమ పరిమాణం, 2019–20 నాటికి రూ.3.10 లక్షల కోట్లకు చేరుతుందని విశ్లేషించింది.

తక్కువ వడ్డీరేటు వద్ద సరళతరమైన రుణ పథకాలను అందుబాటులోకి తేవడం, ఎటువంటి క్లిష్టతలూ లేని అతితక్కువ పేపర్‌ వర్క్, పటిష్టమైన హామీ వ్యవస్థ తదితర అంశాలు ఈ పరిశ్రమ పురోభివృద్ధికి దహదపడతాయని నివేదిక వివరించింది. దేశంలో బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు, సహకార సంస్థలతోపాటు పాన్‌బ్రోకర్లు, స్థానికంగా ఉండే రుణదాతలు కూడా పసిడిపై రుణ సదుపాయాన్ని కల్పిస్తున్నారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top