నష్టాలతో కొత్త సంవత్‌ ప్రారంభం

Giant ball of money could be headed back to stock market - Sakshi

మురిపించని ముహూరత్‌ ట్రేడింగ్‌

194 పాయింట్లు క్షీణించి 32,390కు సెన్సెక్స్‌

64 పాయింట్ల నష్టంతో 10,147కు నిఫ్టీ  

హిందూ సంవత్‌ 2074 నష్టాలతో ఆరంభమైంది. ఆరంభ రోజైన గురువారం దీపావళి నాడు గంట పాటు జరిగిన ప్రత్యేక ముహూరత్‌ ట్రేడింగ్‌లో స్టాక్‌ చీలు బాగానే నష్టపోయాయి. నిఫ్టీ 10,200 మార్క్‌ దిగువకు పడిపోయింది. సెన్సెక్స్‌ ప్రారంభ లాభాలను కోల్పోయి 194 పాయింట్లు క్షీణించి 32,390 పాయింట్ల వద్ద ముగిసింది. ముహూరత్‌ రోజు స్టాక్‌ మార్కెట్‌ పనితీరు ఇంత అధ్వానంగా ఉండటం 2007 తర్వాత ఇదే.

లాభాల స్వీకరణతో నష్టాలు...
హాంగ్‌కాంగ్‌ మార్కెట్‌ ఈ ఏడాదిలోనే అధికంగా నష్టపోవడం, స్పెయిన్‌లో రాజకీయ సంక్షోభం మరింత ముదరడంతో యూరప్‌ మార్కెట్లు రెండు నెలల కనిష్టానికి పడిపోవడం ప్రభావం చూపించాయి. సంవత్‌ 2073లో స్టాక్‌ మార్కెట్‌ 18 శాతం లాభపడడంతో లాభాల స్వీకరణ కూడా జరిగింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 265 పాయింట్ల వదరకూ నిఫ్టీ 88 పాయింట్ల వరకూ నష్టపోయాయి.

లోహ షేర్లకు నష్టాలు
చైనా ఆర్థిక వ్యవస్థ క్యూ3లో స్వల్పంగా తగ్గిందన్న గణాంకాల కారణంగా లోహ షేర్లు పతనమయ్యా యి. బ్యాంకింగ్, మౌలిక, విద్యుత్తు, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ వాహన, కన్సూమర్‌ డ్యూరబుల్స్, ఫార్మా, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ షేర్లు నష్టపోయాయి.

శుక్రవారం సెలవు...
బలి  పాడ్యమి సందర్భంగా శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌కు సెలవు. శని, ఆది వారాలు సాధారణ సెలవులు. మళ్లీ మార్కెట్‌ సోమవారం ప్రారంభమవుతుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top