ఫ్లిప్‌కార్ట్‌ ‘బిగ్ దివాలీ సేల్’ బంపర్‌ ఆఫర్లివే..

Flipkart Big Diwali Sale's Mobile Offers: Redmi Note 4, Lenovo K8 Plus, and More   - Sakshi

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ-కామర్స్  దిగ్గజం ఫ్లిప్‌కార్ట్  మరోసారి ఆకర్షణీయమైన ఆఫర్లను  ప్రకటించింది.  బిగ్ దివాలీ సేల్ పేరుతో నేటి (అక్టోబర్‌ 14) నుంచి 17వ తేదీ వరకు నాలుగు రోజులపాటు నిర్వహిస్తున్న సేల్‌ లో  ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది.   టీవీలు, వాషింగ్‌ మెషీన్లు, ఫ్రిజ్‌లు తదితర గృహోపకరణాలతోపాటు, వస్త్రాలు  షూస్‌లపై  భారీ తగ్గింపును  ప్రకటించింది.  ముఖ్యంగా  ఈ సేల్‌లో మొబైల్స్‌పై భారీ ఆఫర్లు ప్రకటించింది.  బై బ్యాక్ ఆఫర్‌తోపాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి అదనంగా పది శాతం రాయితీ ఇస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫిన్‌సెర్వ్ కార్డులపై నో కాస్ట్- ఈఎంఐ ఆఫర్‌ ఉన్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ వెల్లడించింది.

స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్ల వివరాలు

షావోమీ రెడ్‌మీ నోట్ 4 అసలు ధర రూ.12,999  ఆఫర్‌ ధర రూ.10,999
మోటో సి ప్లస్‌  అసలు ధర రూ.6,999    ఆఫర్‌ ధర రూ.5,999

అలాగే శాంసంగ్ గెలాక్సీ ఆన్ మ్యాక్స్2 రూ.15,900 ధరలో రూ.1000 తగ్గింపుతోపాటు  ఎక్స్‌చేంజ్‌ ద్వారా  పై రూ.3 వేలు తగ్గింపు ఆఫర్‌   చేస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్7 రూ.29,990కి విక్రయిస్తుండగా ఎక్స్‌చేంజ్‌పై మరో రూ.3వేలు అదనంగా ఇస్తోంది. మోటో ఈ4ప్లస్ రూ.9,499కే అందుబాటులో ఉంది. దీనికి రూ.1000 ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఇన్ఫినిక్స్ హాట్ 4 ప్రోను రూ.5,999కే అందుబాటులో ఉంచింది.

మరోవైపు గూగుల్ పిక్సెల్ (32 జీబి) రూ. 57,000  ఆఫర్‌ ధర రూ. 34,999 గూగుల్ పిక్సెఎ‍క్స్‌ఎల్‌  (32జీబీ) రూ. 67,000 కాగా  ఆఫర్‌ ధరలో  రూ. 39,999లకే  భారీ తగ్గింపుతో విక్రయిస్తోంది.

అంతేకాదు, మోటో టర్బో, మోటో ఎక్స్‌(32జీబీ)  ఆనర్ 5ఎ‍క్స్‌  హువాయ్ పీ9, లీఎకో లె మాక్స్ 2, ఆల్కాటెల్ ఐడల్ 4 పై కూడా తగ్గింపు ధరలను అందిస్తోంది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top