సెబీకి సాంకేతిక సేవలకు 7 సంస్థల షార్ట్‌లిస్ట్‌

Firms continue to file DRHPs with Sebi despite IPO lull - Sakshi

న్యూఢిల్లీ: స్టాక్‌మార్కెట్లను మరింత మెరుగ్గా పర్యవేక్షించేందుకు అవసరమైన సాంకేతిక సేవలు అందించడం కోసం ఏడు ఐటీ సంస్థలను షార్ట్‌లిస్ట్‌ చేసినట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వెల్లడించింది. వీటిలో విప్రో, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్, యాక్సెంచర్‌ సొల్యుషన్స్, క్యాప్‌జెమిని టెక్నాలజీ సర్వీసెస్‌ ఇండియా, హ్యులెట్‌ ప్యాకార్డ్, ఈఐటీ సర్వీసెస్, తరవు టెక్నాలజీస్‌ ఉన్నాయి.

విశ్లేషణ సామర్ధ్యాలను మెరుగుపర్చడం, ప్రైవేట్‌ క్లౌడ్‌ డేటా స్టోరేజీని రూపొందించడం, బ్రోకరేజి సంస్థల లావాదేవీలను ఆటోమేటిక్‌గా తనిఖీ చేయగలిగే సామర్ధ్యాన్ని సమకూర్చడం తదితర అంశాలకు సంబంధించి ఈ సంస్థలు టెక్నాలజీపరమైన సేవలు అందించాల్సి ఉంటుంది. తద్వారా నిఘా, విచారణ కార్యకలాపాలను మరింత పటిష్టం చేయొచ్చని సెబీ భావిస్తోంది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top