క్లిక్‌-టూ-వాట్సాప్‌: ఫేస్‌బుక్‌ కొత్త ఫీచర్‌

FB launches 'click-to-WhatsApp' feature for businesses to reach users - Sakshi

ఫేస్‌బుక్‌లో ప్రకటనల ద్వారా బిజినెస్‌లు చేస్తున్నారా? ఇప్పుడు మరింత మంది యూజర్లను తమ సొంతం చేసుకోవచ్చు. ఫేస్‌బుక్‌ తాజాగా క్లిక్‌-టూ-వాట్సాప్‌ పేరు మీద సరికొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ ఫీచర్‌ ద్వారా 100 కోట్ల మంది వాట్సాప్‌ యూజర్లను  అడ్వర్‌టైజర్లు కనెక్ట్‌ చేసుకోవచ్చు. శుక్రవారం ఈ విషయాన్ని టెక్‌క్రంచ్‌ ద్వారా ఫేస్‌బుక్‌ ధృవీకరించింది. ఈ ఫీచర్‌ను క్రమంగా అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నట్టు కూడా తెలిపింది. ఉత్తర, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆసియాలో పలు ప్రాంతాల్లో తొలుత దీన్ని ప్రారంభించింది. చిన్న చిన్న వ్యాపారాలతో కమ్యూనికేట్‌ అవడానికి చాలా మంది వాట్సాప్‌ను వాడుతున్నారు.

ఇది చాలా వేగవంతమైనదని, యూజర్లతో టచ్‌లో ఉండటానికి ఇది అనువైన మార్గమమని ఫేస్‌బుక్‌ ప్రొడక్ట్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌ పంచమ్‌ గజ్జర్‌ చెప్పారు. ఫేస్‌బుక్‌ ప్రకటనల కోసం క్లిక్‌-టూ-వాట్సాప్‌ బటన్‌ను యాడ్‌ చేయడం ద్వారా, వ్యాపారస్తులు తమ ఉత్పత్తులను చాలా త్వరగా ప్రజలకు చేరవేయడానికి ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుతం 10 లక్షల పేజీలు, వాట్సాప్‌ నెంబర్లను తమ పోస్టులకు జతచేర్చాయి. యూజర్లు ఉత్పత్తుల గురించి సంభాషణ జరుపడానికి తమ కాంటాక్ట్స్‌లో వ్యాపారస్తుల వాట్సాప్‌ నెంబర్లను యాడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫీచర్‌ అచ్చం గతేడాది నవంబర్‌లో లాంచ్‌ చేసిన క్లిక్‌-టూ-మెసెంజర్‌ బటన్‌ మాదిరే ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top