ఫేస్‌బుక్‌ సీఈవో పర్సనల్‌ ఛాలెంజ్‌ ఇదే!

Facebook CEO Mark Zuckerberg's Personal Challenge for 2018: Fix Facebook - Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో : కొత్త సంవత్సరం అడుగుపెట్టగానే.. తన వ్యక్తిగత తీర్మానాలను నిర్ధారించుకునే ఫేస్‌బుక్‌ సీఈవో వాటిని సక్సస్‌ఫుల్‌గా నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు. గత తొమ్మిదేళ్లుగా కొనసాగిస్తున్న ఈ సంప్రదాయాన్ని ఆయన ఈ ఏడాది కూడా ప్రకటించారు. 2018లో వ్యక్తిగత సవాల్‌గా ఆయన ఫేస్‌బుక్‌గా ఫిక్స్‌ చేశారు. గురువారం తన ఫేస్‌బుక్‌ పేజీలో రాసిన పోస్టులో, ఈ ఏడాది తన ఫేస్‌బుక్‌ యూజర్లను దుర్వినియోగం నుంచి, విద్వేషపూరిత నుంచి కాపాడాలని నిర్ణయించుకున్నానని, దీనిపై ఫేస్‌బుక్‌ చాలా వర్క్‌ చేసిందని పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌ పేజీకి సమయాన్ని కేటాయించడం, చాలా మంచిగా కేటాయించినట్టు భావించాలని పేర్కొన్నారు.

ప్రతేడాది ఏదో  ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవడం కోసం, వ్యక్తిగత సవాళ్లను నిర్దేశించుకుంటూ వెళ్తున్నానని, అమెరికాలోని ప్రతి రాష్ట్రాన్ని సందర్శించానని జుకర్‌బర్గ్‌ తెలిపారు. ఈ తొమ్మిదేళ్లలో 365 మైళ్ల పరుగు, తన ఇంటి కోసం ఏఐని రూపొందించుకోవడం, 25 పుస్తకాలు చదవడం, మాండరిన్‌ను నేర్చుకోవడం వంటివి చేసినట్టు  వెల్లడించారు. అన్ని తప్పులను లేదా దుర్వినియోగాలను నిర్మూలించకపోయినా... తమ పాలసీలతో చాలా తప్పులను సరిదిద్దుతామని, దుర్వినియోగాన్ని అరికడతామని పేర్కొన్నారు. ఈ ముఖ్యమైన అంశాలనే 2018లో తన వ్యక్తిగత సవాళ్లుగా నిర్ణయించినట్టు చెప్పారు. ఫేస్‌బుక్‌ సీఈవోగా తనకు పనిచేయాలని ఉందని కూడా తెలిపారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top