భారత్‌ ‘ఐపీఓ’ల రికార్డ్‌

Earnings revival, stability key for IPO marker success: EY survey - Sakshi

ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో జోరుగా భారత ఐపీఓలు  

ప్రపంచంలో మన దగ్గరే అధిక ఐపీఓలు  

ఈవై ఇండియా ఐపీఓ రెడీనెస్‌ సర్వే వెల్లడి  

న్యూఢిల్లీ: భారత్‌లో ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)ల జోరు నడుస్తోంది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో భారత్‌లో  మొత్తం 90 ఐపీఓలు వచ్చాయని, ఈ ఐపీఓలు అన్నీ కలిసి 390 కోట్ల డాలర్లు సమీకరించాయని ఈవై ఇండియా ఐపీఓ రెడీనెస్‌ సర్వే నివేదిక తెలిపింది. సంఖ్య పరంగా చూస్తే, ప్రపంచంలోనే అత్యధిక ఐపీఓలు భారత్‌లోనే వచ్చాయని ఈ నివేదిక పేర్కొంది.

ఇన్వెస్టర్ల విశ్వాసం నిలకడగా ఉండటం, ఈక్విటీ మార్కెట్లో దేశీయ పెట్టుబడులు పెరగడం, కంపెనీల ఆర్థిక స్థితిగతులపై ఆశావహ అంచనాలు, ఈక్విటీ మార్కెట్‌లో ఒడిదుడుకులు తక్కువగా ఉండటం, స్థూల ఆర్థికాంశాలు నిలకడగా ఉండటం, ఇన్వెస్టర్ల ఆసక్తి అధికంగా ఉండటం వల్ల భారత్‌లో ఐపీఓల జోరు కొనసాగుతోందని ఈ నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే...

భారత్‌లో ఐపీఓల జోరు పెరుగుతోంది. పలు కంపెనీలు 2018లో స్టాక్‌ మార్కెట్లోకి లిస్ట్‌ కావాలని యోచిస్తుండడంతో ఐపీఓకు వచ్చే కంపెనీల సంఖ్య పెరుగుతోంది.  
 మంచి నాణ్యత గల కంపెనీలు, ఐపీఓ ప్రైస్‌బ్యాండ్‌ ఆకర్షణీయంగా ఉండి, సరైన సమయంలో వచ్చిన ఐపీఓలు విజయవంతం అయ్యాయి.  
 ప్రపంచవ్యాప్తంగా చూస్తే, సంఖ్య విషయంలో భారత ఐపీఓల వాటా 16 శాతంగా, సమీకరించిన నిధుల పరంగా చూస్తే, భారత వాటా 5 శాతంగా ఉంది.  
గత ఏడాది ఆరు నెలల కాలంలో వచ్చిన ఐపీఓలతో పోల్చితే ఈ ఏడాది 27 శాతం అధికంగా ఐపీఓలు వచ్చాయి. ఇక నిధుల పరంగా చూస్తే, 28 శాతం వృద్ధి నమోదైంది.  
ఆర్థిక, మౌలిక, కన్సూమర్‌ రంగాల్లోని కంపెనీలు ఎక్కువగా ఐపీఓకు వస్తున్నాయి. ఈ రంగాల్లో వృద్ధి జోరు కొనసాగుతుండటమే దీనికి ప్రధాన కారణం.  
ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో మొత్తం 90 కంపెనీలు ఐపీఓకు వచ్చాయి. వీటిల్లో 15 కంపెనీలు బొంబాయి స్టాక్‌ ఎక్సే ్చంజ్, ఎన్‌ఎస్‌ఈల్లో లిస్టయ్యాయి. నేషనల్‌ ఎస్‌ఎమ్‌ఈలో 42 కంపెనీలు, బాంబే ఎస్‌ఎమ్‌ఈలో 33 చొప్పున లిస్టయ్యాయి.  
 ఐపీఓ ప్రైస్‌బ్యాండ్‌ అధికంగా ఉండటం, నిర్వహణ తీరు సరిగ్గా లేకపోవడం ఐపీఓలకు సంబంధించిన అతి పెద్ద సమస్యలని ఈ సర్వేలో తేలింది.  
 ఈ ఏడాది జనవరి–జూన్‌ కాలానికి వచ్చిన ఐపీఓల్లో అధిక భాగం (27 వరకూ) పారిశ్రామిక రంగాల నుంచి వచ్చినవే ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో వినియోగ రంగం(18), మెటీరియల్స్‌ రంగం(14), వినియోగ ఉత్పత్తులు(10), టెక్నాలజీ (5) ఉన్నాయి.  
సమీకరించిన నిధుల పరంగా చూస్తే, 150 కోట్ల డాలర్ల సమీకరణతో ఇండస్ట్రియల్స్‌ రంగం అగ్రభాగాన నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఆర్థిక రంగం(150 కోట్ల డాలర్లు), కన్సూమర్‌ స్టేఫుల్స్‌(28 కోట్ల డాలర్లు), మీడియా, వినోద రంగం(16 కోట్ల డాలర్లు), ఆరోగ్య సం రక్షణ (16 కోట్ల డాలర్లు) ఉన్నాయి.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top