రూ.1 డౌన్‌పేమెంట్‌, లక్ష రూపాయలు ఆదా

Down payment of Re 1, savings of Rs 1 lakh: Tata Motors' year-end offer - Sakshi

ఇయర్‌-ఎండ్‌ అమ్మకాల్లో భాగంగా ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ తన కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. 'మెగా ఆఫర్‌ మ్యాక్స్‌ సెలబ్రేషన్స్‌' సేల్స్‌ ఆఫర్‌ను టాటా మోటార్స్‌ లాంచ్‌ చేసింది. ఈ ఆఫర్‌లో భాగంగా టాటా కారు కొనుగోలుకు రూపాయి డౌన్‌పేమెంట్‌ కట్టి, లక్ష రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. మోడల్‌, వేరియంట్‌పై ఈ ఆఫర్‌ ఆధారపడి ఉంటుందని పేర్కొంది.

ఇయర్‌-ఎండ్‌ అమ్మకాల్లో కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం టాటా మోటార్స్‌ ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. దిగ్గజ ఫైనాన్సియర్లు, బ్యాంకులతో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న టాటా మోటార్స్‌, ఆకర్షణీయమైన ఫైనాన్సియల్‌ స్కీమ్స్‌తో ప్యాసెంజర్‌ వాహనాలపై 100 శాతం వరకు ఫండింగ్‌ అందిస్తోంది. తమ కార్లను ఎక్స్చేంజ్‌ చేసుకోవడానికి కస్టమర్లకు ఇది ఎంతో ఉన్నతమైన అవకాశమని, భారీ మొత్తంలో సేవింగ్స్‌ ప్రయోజాన్ని కస్టమర్లు పొందవచ్చని టాటా మోటార్స్‌ పేర్కొంది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top