తర్వాత ఫెడ్‌ చైర్మన్‌ ఆయనే...

Donald Trump to nominate Jerome Powell as next Fed chair - Sakshi

ఫెడరల్‌ రిజర్వు చైర్మన్‌ జానెట్‌ యెలెన్‌ పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగియబోతుంది. ఈ నేపథ్యంలో కొత్త చైర్మన్‌ ఎంపికపై కసరత్తు దాదాపు పూర్తయింది. తదుపరి అమెరికా సెంట్రల్‌ బ్యాంకు చైర్మన్‌గా జెరోమ్ పావెల్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నియమించనున్నట్టు వైట్‌హౌస్‌ ప్రకటించింది. అక్టోబర్‌ 8నే పావెల్‌ను అధ్యక్షుడు నియమించారని, మంగళవారం ఆయనతో చర్చలు కూడా జరిపారని జిన్హువా న్యూస్‌ ఏజెన్సీ రిపోర్టు చేసింది. ఇటీవలే తదుపరి ఫెడ్‌ చైర్మన్‌ ఎంపిక కోసం ఐదుగురు అ‍భ్యర్థులను ఇంటర్వ్యూలు చేశారు. వారిలో ఒకరు పావెల్‌ కాగ, మరో నలుగురు స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ ఎకనామిస్ట్‌ జాన్‌ టైలర్‌, మాజీ ఫెడరల్‌ గవర్నర్‌ కెవిన్‌ వార్ష్‌,  వైట్ హౌస్ నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్ గారి కొహ్న్, ప్రస్తుత ఫెడ్ చైర్మన్‌ జానెట్ యెలన్‌లున్నారు. 

ఈ విషయంపై గురువారం అధికారికంగా ప్రకటించనున్నట్టు ట్రంప్‌ చెప్పారు. ఒకవేళ ఆయన్ని సెనేట్‌ ఆమోదిస్తే, పావల్‌ తర్వాతి ఫెడ్‌ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. పావెల్‌ లాయర్‌, మాజీ అమెరికా ట్రెజరీ అధికారి. మూడు దశాబ్దాల్లో ఎకనామిక్స్‌లో ఎలాంటి పీహెచ్డీ లేని అభ్యర్థి తొలిసారి ఫెడ్‌ చైర్మన్‌ కాబోతున్నారు. పావెల్‌ నియామకాన్ని వాల్‌స్ట్రీట్‌ కూడా మంచిగా స్వీకరించనుందని తెలుస్తోంది. కాగ, తాజాగా జరిగిన ఫెడరల్‌ రిజర్వు సమావేశంలో వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించనున్నట్టు పేర్కొంది. దీంతో ఈ రేటు 1-1.25శాతం శ్రేణిలో ఉంది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top