స్మార్ట్‌ రికవరీ : మార్కెట్లకు బీజేపీ జోష్‌

D-St makes smart recovery; Sensex rises 139 pts after 800-pt plunge - Sakshi

ముంబై : గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బుల్స్‌కు, బీజేపీకి గట్టి పోటీ నెలకొంది. తొలుత కాంగ్రెస్‌ స్వల్ప ఆధిక్యం కనబర్చడంతో భారీగా పతనమైన స్టాక్‌ మార్కెట్లు, బీజేపీ మళ్లీ విజయ దుందుభి మోగిస్తుండటంతో బుల్‌ రంకెలేసింది.. 800 పాయింట్ల మేర పడిపోయిన సెన్సెక్స్‌, తిరిగి పుంజుకుని త్రిపుల్‌ సెంచరీని సాధించింది. కానీ చివరికి కాస్త ప్రాఫిట్‌ బుకింగ్‌ చోటు చేసుకోవడంతో, సెన్సెక్స్‌ 138.71 పాయింట్ల లాభంలో 33,601 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 55.50 పాయింట్ల లాభంలో 10,388 వద్ద క్లోజైంది. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌ నేడు జరుగుతోంది. ఈ ఫలితాల సరళికి అనుకూలంగా మార్కెట్లు ట్రేడవుతూ వచ్చాయి. 

ప్రారంభంలో కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉన్నట్టు తెలియగానే, ఇన్వెస్టర్లు భారీ ఎత్తున్న అమ్మకాలకు తెరలేపారు. అనంతరం మళ్లీ బీజేపీ పుంజుకోవడంతో, ఇన్వెస్టర్లు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతూ రావడంతో, మార్కెట్లు కూడా లాభాలు పండిస్తూ వచ్చాయి.  గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలో విజయాలతో ప్రధాని మోడీ చేపట్టిన పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ వంటి సంస్కరణలకు ప్రజల మద్దతు లభిస్తున్నదన్న అంచనాలు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. అంతేకాక 2019 ఎన్నికలపై కూడా ఈ ఫలితాల ప్రభావం ఉండనుందని చెప్పారు. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 18 పైసల నష్టంలో 64.22గా ఉంది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో బంగారం ధరలు 109 రూపాయల లాభంలో రూ.28,363గా ఉన్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top