ఆధునిక టెక్నాలజీతో ఆసుస్‌ కొత్త స్మార్ట్‌ఫోన్‌

Asus Zenfone Ares launched with 8GB RAM, AR, VR capabilities - Sakshi

భారీ స్క్రీన్‌, ర్యామ్‌

అడ్వాన్స్‌డ్‌ ఏఆర్‌, విఆర్‌  టెక్నాలజీ

ధర : సుమారు 23 వేలు

ఆసుస్‌ జెన్‌ఫోన్‌  సరికొత్త టెక్నాలజీతో నూతన  స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది.  టెక్నాలజీ ఆవిష్కరణలోఆకట్టుకుంటున్న ఆసుస్‌   అధునిక ‘ఏఆర్‌, వీఆర్‌ ఆధారితంగా పనిచేసే  సరికొత్త ‘ఆసుస్‌ జెన్‌ ఫోన్‌ ఏరేస్‌’  పేరుతో తైవాన్‌లో లాంచ్‌ చేసింది.   6జీబీ, 8జీబీ వేరియంట్లను ఈ ఫోన్  ధర తైవానీస్ మార్కెట్లో విడుదల చేసింది.  ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర  మన  కరెన్సీలో సుమారు2 3వేలరూపాయల ధరతో ప్రారంభించింది. ట్రూ 2 లైఫ్‌ డిస్‌ప్లే తమ డివైస​ ప్రత్యేకత అని కంపెనీ చెబుతోంది.
గత ఏడాది ఆరంభించిన ఆసుస్ జెన్‌ఫోన్‌ ఏఆర్‌ ఫీచర్ల మాదిరిగానే ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు ఉన్నప్పటికీ అంగ్‌మెంటెడ్‌ రియాలిటీ (ఏఆర్‌) వర్చువల్ రియాలిటీ (వీఆర్‌) సామర్ధ్యాలను  ఈ తాజా స్మార్ట్‌ఫోన్‌లో జోడించింది. ఇక ధర విషయానికి వస్తే ఆసుస్ జెన్‌ఫోన్ ఆర్‌తో పోలిస్తే ఇది చాలా చౌకధర అనే చెప్పవచ్చు.  జెన్‌ఫోన్ ఆర్‌ ధర భారతదేశంలో రూ .49,000 గా  ఉంది.

ఆసుస్‌ జెన్‌ఫోన్‌ ఏరేస్‌ ఫీచర్లు
5.7 అంగుళాల  సూపర్ అమోలెడ్‌ డిస్‌ప్లే
1440 x 2560 రిజల్యూషన్‌
స్నాప్‌డ్రాగన్‌ 821 చిప్‌ సెట్‌
ఆండ్రాయిడ్‌ నౌగాట్‌
8జీబీ ర్యామ్‌
128 జీబీ స్టోరేజ్‌
2 టీబీ వరకు  విస్తరణకు అవకాశం
23 ఎంపీ రియర్‌ కెమరా
8 ఎంపీ సెల్పీ కెమెరా
3,300 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top