అనరాక్‌ రిటైల్‌ విభాగం షురూ

Anarak Retail Department Shuru - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్‌ ప్రాపర్టీ కొత్తగా అనరాక్‌ రిటైల్‌ విభాగాన్ని ప్రారంభించింది. ఫెయిత్‌లేన్‌ ప్రాపర్టీ కన్సల్టెన్సీతో కలిసి ఈ విభాగాన్ని ప్రారంభించినట్లు అనరాక్‌ చైర్మన్‌ అనూజ్‌ పూరీ తెలిపారు. దేశంలో రిటైల్‌ విభాగంలో రిటైలర్లకు, స్థలాలకు, పెట్టుబడిదారులకు మధ్య ఉన్న వ్యత్యాసం పెరుగుతుందని.. రిటైలర్లకు, ఇన్వెస్టర్లకు మధ్య అనుసంధానంగా ఈ విభాగం పనిచేస్తుందన్నారు.

2017లో దేశంలో 50 లక్షల చ.అ. రిటైల్‌ స్థలం మూత పడిపోయిందని.. రిటైల్‌ స్థలం ఆఫీసు, మిక్స్‌డ్‌ యూజ్, ఆసుపత్రులకు మారుతున్నాయని చెప్పారు. అనరాక్‌ రిటైల్‌ సీఈఓగా అనూజ్‌ కేజ్రివాల్‌ నియమితులయ్యారు. ఈయన బృందంలో 30 రిటైల్‌ రియల్‌ ఎస్టేట్‌ నిపుణులు పనిచేస్తారు. వచ్చే ఏడాది కాలంలో ఈ సంఖ్యను 100కు చేర్చుతామని కంపెనీ తెలిపింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top