జియో ఫైబర్‌కు దీటుగా ఎయిర్‌టెల్‌ ఎక్స్ర్టీమ్‌ ప్లాన్‌

Airtel Xstream Fiber Ultra Launched To Counter JioFiber - Sakshi

ముంబై : రిలయన్స్‌ జియో ఫైబర్‌ ప్లాన్స్‌ను ప్రకటించిన క్రమంలో ఎయిర్‌టెల్‌ సైతం హైస్పీడ్‌ సేవలతో కూడిన ప్లాన్‌ ఎక్స్ర్టీమ్‌ ఫైబర్‌ పేరుతో ముందుకొచ్చింది. వన్‌ జీబీపీఎస్‌ నెట్‌వర్క్‌ వేగంతో ఎయిర్‌టెల్‌ హోం బ్రాడ్‌బ్యాండ్‌ను ఆఫర్‌ చేస్తోంది. జియో ఫైబర్‌ తరహాలోనే ప్లాన్‌ ధరను, బెనిఫిట్స్‌ను ఎయిర్‌టెల్‌ నిర్ధారించింది. ఎయిర్‌టెల్‌ ఇటీవల ప్రకటించిన ఎక్ట్స్రీమ్‌ మల్టీమీడియా స్మార్ట్‌ ఎకోసిస్టమ్‌లో భాగంగా ఈ ఫైబర్‌ సర్వీస్‌ను లాంఛ్‌ చేసింది. ఎక్ట్స్రీమ్‌ ఫైబర్‌ ప్లాన్‌కు వినియోగదారులు నెలకు రూ 3,999 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ధరతో వన్‌జీబీపీఎస్‌ నెట్‌వర్క్‌ స్పీడ్‌తో సేవలు లభిస్తాయి. నెలరోజులకు వర్తించే ఈ ప్లాన్‌లో ఎయిర్‌టెల్‌థ్యాంక్స్‌కు వర్తించే బెనిఫిట్లు అందుబాటులోకి వస్తాయి. ఈ ప్లాన్‌లో ఎంత డేటా అందిస్తారనేది ఎయిర్‌టెల్‌ నిర్ధిష్టంగా వెల్లడించకపోయినా సబ్‌స్ర్కైబర్లు ఆరు నెలల వ్యవధిలో 1000జీబీ డేటాను అదనంగా పొందుతారని పేర్కొంది. ఎక్స్ట్రీమ్‌ ఫైబర్‌ ల్యాండ్‌ లైన్‌ కనెక్షన్‌తో అపరిమిత కాల్స్‌ను ఆఫర్‌ చేస్తుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top